Teaching/Examiner Posts: సీజీపీడీటీఎంలో 553 ఉద్యోగాలు.. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక..
డిగ్రీ, పీజీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం
- మొత్తం పోస్టుల సంఖ్య: 553
- విభాగాల వారీగా పోస్టుల వివరాలు: ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్-ఎ(గెజిటెడ్) పోస్టులు.. బయోటెక్నాలజీ-50, బయోకెమిస్ట్రీ-20, ఫుడ్ టెక్నాలజీ-15, కెమిస్ట్రీ-56, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ-09, బయోమెడికల్ ఇంజనీరింగ్-53, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-108, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-29, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-63, ఫిజిక్స్-30, సివిల్ ఇంజనీరింగ్-09, మెకానికల్ ఇంజనీరింగ్-99, మెటలర్జికల్-04, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ 08 పోస్టులు ఉన్నాయి.
అర్హత
- ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 04.08.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఓబీసీలకు, ఎక్స్ -సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ఇలా
రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష
- ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఐదు విభాగాల నుంచి మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఐపీ లెజిస్లేషన్, వీఐపీఓ సంబంధిత అంశాలు ఉంటాయి, పరీక్ష సమయం 2 గంటలు.
- జనరల్ ఇంగ్లిష్‌లో కాంప్రహెన్షన్, ప్రెసీ రైటింగ్, వొకాబ్యులరీ, షార్ట్ ఎస్సేలు ఉంటాయి. విషయాన్ని చదివి, అర్థం చేసుకుని తమ ఆలోచనలను అభ్యర్థులు స్పష్టంగా, సరిగా తెలియచేస్తారో లేదోపరీక్షిస్తారు.
- న్యూమరికల్/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మేథమెటికల్ కాలిక్యులేషన్స్‌లో అభ్యర్థికి ఉండే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. అర్థమెటికల్ రీజనింగ్, గ్రాఫ్ అండ్ టేబుల్ రీడింగ్, పర్సంటేజ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ తదితర అంశాల çనుంచి ప్రశ్నలుంటాయి.
- వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్‌లో భాగంగా అభ్యర్థి తార్కిక నైపుణ్యం, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నలు, చిత్రాల రూపంలో ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకుని సమాధానాలను గుర్తించగలగాలి.
- జనరల్ సైన్స్‌లో భాగంగా సైంటిఫిక్ మెథడాలజీ కాన్సెఫ్ట్స్, ప్రిన్సిపల్స్, టెక్నిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఎర్త్/స్పేస్ సైన్స్, టెక్నాలజీ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌లో వర్తమానాంశాలపై ప్రశ్నలు అడుగుతారు. జాతీయ, అంతర్జాతీయం, ఆర్థికం, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. న్యూస్ పేపర్ చదవడం, వార్తలు వినడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు.న
- పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా ప్రిపరేషనల్ ప్లాన్ రూపొందించుకోవాలి.
- ఎక్కువగా మాదిరి ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టులు రాయాలి. ఫలితంగా నిర్దిష్ట సమయం లోపలే సమాధానాలు రాయగలుగుతున్నారో లేదో తెలుసుకునే వీలవుతుంది.
అర్హత మార్కులు
ఈ పరీక్షలో అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులు-30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూస్ అభ్యర్థులు 25 శాతం, ఇతరులు 20 శాతం కనీస అర్హత మార్కులుగా సాధించాలి. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఇరవై రెట్ల మందిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్స్ పరీక్ష
- ఆఫ్‌లైన్ విధానంలో మెయిన్ రాత పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఆబ్జెక్టివ్ పద్ధతిలో, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్-1 వంద మార్కులకు, పేపర్-2 మూడు వందల మార్కులకు ఉంటాయి.
- పేపర్-1లో ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు, ఎలిమెంటరీ మేథమెటిక్స్-20 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ-20 ప్రశ్నలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్-20 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
చదవండి: IISER Mohali Recruitment 2023: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
పరీక్ష సమయం 2 గంటలు.
- టెక్నికల్/సైంటిఫిక్ విభాగంలో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా పేపర్-2 ఉంటుంది. ఇందులో 300 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. అభ్యర్థుల తుది ఎంపికలో ఈ రెండు పేపర్లలో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. పేపర్-2 సిలబస్ విభాగాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
- పేపర్-2లో సమాధానాలను స్పష్టంగా, అర్థమయ్యేలా రాయాలి. కొట్టివేతలు లేకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. ఖాళీల సంఖ్యకు ఐదురెట్ల మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్ష నుంచి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ ఇలా
ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో పొందిన మార్కులను తుది ఎంపికలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
వేతనాలు
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ పే 10 ప్రకారం- నెలకు రూ.53,100-రూ.1,77,500 వరకు వేతనంగా అందుతుంది. వీటితోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.08.2023
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 03.09.2023
- మెయిన్స్ పరీక్ష తేదీ: 01.10.2023
- వెబ్‌సైట్: https://cgpdtm.qcin.org/
చదవండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |