BEL Recruitment 2022: బెల్, బెంగళూరులో సీనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఏడాదికి రూ.17 లక్షల వేతనం..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్లు–06, సీనియర్ ఇంజనీర్లు–27.
డిప్యూటీ మేనేజర్లు: విభాగాలు: కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.02.2022 నాటికి 36 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: ఏడాదికి రూ.17 లక్షలు చెల్లిస్తారు.
సీనియర్ ఇంజనీర్లు:
విభాగాలు: కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: ఏడాదికి రూ.14 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపికచేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని రాత పరీక్షకు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్),జలహల్లి పోస్ట్, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 18.04.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 18,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |