Teacher Training: డైట్‌లో టీచర్లకు శిక్షణ
ఇందుకూరుపేట: మండలంలోని పల్లిపాడు డైట్‌లో గురువారం ‘మ్యాజిక్ బస్ అకాడమీ’ ఆధ్వర్యంలో టీచర్లకు జీవన నైపుణ్యంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్, డైట్ ప్రిన్సిపల్ పి.రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్‌టీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ మూడురోజులపాటు జరుగుతుందన్నారు. 400 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలల నుంచి ఒక వ్యాయామ, ఒక ఔత్సాహిక ఉపాధ్యాయుడు హాజరైనట్లు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కె.వెంకటేశ్వరరావు, ఆర్పీలు బోయ దాసు, విజయచంద్ర, నరసింహారావు పాల్గొన్నారు.
తప్పు చేస్తే కఠిన చర్యలు
- ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌కుమార్‌రెడ్డి
ఉదయగిరి: ‘విద్యార్థులు, మహిళలకు నాణ్యతతో కూడిన ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. ఆహారం పంపిణీ విషయంలో తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీ్త్రశక్తి భవనంలో గురువారం ఆయన సివిల్ సప్లైస్, ఐసీడీఎస్, వెల్ఫేర్ హాస్టల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే అన్ని సరుకులు లబ్ధిదారులకు పక్కాగా అందాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును టీచర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. తొలుత మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు తనిఖీ చేశారు. విద్యార్థులు, లబ్ధిదారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పరిమళ, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Teacher Jobs: ఏకలవ్య పాఠశాలలో టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!
కొనసాగుతున్నడిగ్రీ పరీక్షలు
వెంకటాచలం: వీఎస్‌యూ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో జూన్ 12వ తేదీ నుంచి డిగ్రీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నా యి. గురువారం ఉదయం జరిగిన డిగ్రీ నాలు గో సెమిస్టర్ పరీక్షలో 427 మంది విద్యార్థులకు గానూ 377 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరైనట్లు పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం కృష్ణచైతన్య డిగ్రీ కళాశాలలో ఒకరు, వీఆర్ డిగ్రీ కళాశాలలో ఒకరిని డిబార్ చేశారని తెలియజేశారు.