Google: గూగుల్‌లో ఉద్యోగం వస్తే పండగే.... ఉద్యోగులకు కోట్ల జీతాన్ని ఇస్తోన్న టెక్ దిగ్గజం
ప్రపంచంలో టాప్ శాలరీ ఇచ్చే కంపెనీల్లో మొదటి స్థానంలో గూగుల్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇందులో ఉద్యోగం వస్తే ఇక లైఫ్ సెటిలైనట్లేనని చదువుపూర్తి చేసిన యువత భావిస్తుంటుంది.
ఇవీ చదవండి: IT Companies: కంపెనీలన్నీ కుమ్మక్కు... ఐటీ ఉద్యోగులకు ఇకపై కష్టకాలమే..!
తాజాగా వెలువడిన ఓ నివేదిక వైరలవుతోంది. గూగుల్‌లో ఒక్కో ఉద్యోగికి యావరేజ్ వేతనమే కోట్లలో ఉన్నట్లు ఆ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం గూగుల్ ఉద్యోగుల వేతనాలు ఇలా ఉన్నాయి. 2022లో గూగుల్‌లో ఉద్యోగి సరాసరి వేతనం 2,79,802 డాలర్లఅని తెలిసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఒక్కో ఉద్యోగి రూ. 2.30 కోట్లు వేతనంగా పొందుతున్నారు. అలాగే 2022లో గరిష్ట వేతనం 7,18,000 డాలర్లుగా ఉంది. ఇది ఇండియన్ కరెన్సీలో రూ. 5.90 కోట్లు. అంటే ఉద్యోగి గరిష్ట వార్షిక వేతనం సుమారు రూ. 6 కోట్ల వరకు ఉంది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో అత్యధిక వేతనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే దక్కుతోంది. వీరి తరువాత ఇంజినీరింగ్ మేనేజర్, డైరెక్ట్ సేల్స్ విభాగాల్లో పనిచేసేవారున్నారు. ఎక్కువ శాలరీ తీసుకున్న ఉద్యోగులు ఈ కింద చూపించిన విధంగా ఉన్నారు.
ఇవీ చదవండి: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు గడ్డురోజులే... రానున్న రెండేళ్లలో ప్రోగ్రామర్ల ఉద్యోగాలకే ఎసరు..!
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: 7,18,000 డాలర్లు (రూ. 5.90 కోట్లు)
ఇంజినీరింగ్ మేనేజర్: 4,00,000 డాలర్లు (రూ. 3.28 కోట్లు)
ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్: 3,77,000 డాలర్లు (రూ. 3.09 కోట్లు)
లీగల్ కార్పొరేషన్ కౌన్సిల్: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు)
సేల్స్ స్ట్రాటజీ: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు)
యుఎక్స్ డిజైన్: 3,15,000 డాలర్లు (రూ. 2.58 కోట్లు)
గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ: 3,12,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు)
రీసర్చ్ సైంటిస్ట్: 3,09,000 డాలర్లు (రూ. 2.53 కోట్లు)
క్లౌడ్ సేల్స్: 3,02,000 డాలర్లు (రూ. 2.47 కోట్లు)
ప్రోగ్రాం మేనేజర్: 3,00,000 డాలర్లు (రూ. 2.46 కోట్లు)