Developers will lose jobs: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు గడ్డురోజులే... రానున్న రెండేళ్లలో ప్రోగ్రామర్ల ఉద్యోగాలకే ఎసరు..!
ఇప్పటివరకు అందరూ చంకలు గుద్దుకుంటున్నా రానున్న రోజుల్లో ఏఐ దెబ్బకు నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోతుందని టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టెబిలిటీ ఏఐ సీఈఓ Emad Mostaque ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి సాఫ్ట్‌వేర్ రంగం ఊగిసలాడుతోంది. ఉన్నంతలో జావా, పైథాన్ నిపుణులకు పెద్దఎత్తున డిమాండ్ ఉంది. ప్రోగ్రామింగ్ లాగ్వేజ్, కోడ్ డెవలపర్లకు మంచి వేతనాలు ఆఫర్ చేసి దిగ్గజ కంపెనీలన్నీ నియమించుకుంటున్నాయి. ఏదైనా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయాలన్నా, కోడింగ్ రాయాలన్నా జావా, పైథాన్ ఇంజినీర్లు రాసే కోడ్ కీలకం.
చదవండి: Open-Source AI: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ
ఒక్క ప్రోగ్రామ్ రాయడానికి వీరు వారాలు, నెలలు సమయం తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ, గూగుల్ చాట్‌బాట్స్ కేవలం నిమిషాలల్లోనే కోడింగ్ రాసేస్తున్నాయి. అదీ తప్పులు లేకుండా. అయితే వీటిని కంపెనీలు తమ అవసరానికి తగ్గట్లు కొద్దిగా రీ మాడిఫై చేసుకుంటే సరిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
చదవండి: ChatGPT: 20 ప్రశ్నలకు అరలీటర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే
ఈ నేపథ్యంలో కోడింగ్ పై ఆధారపడిన ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రెండేళ్ల తర్వాత ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని Emad Mostaque అంచనావేస్తున్నారు. AI బూమ్ కొనసాగుతున్నప్పుడు చాలా కంపెనీలు కూడా వాటి ప్రయోజనాల కోసమే పని చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సెకండ్లలో వైరల్ అవుతున్న నకిలీ/తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి కూడా ఏఐ ఉపకరిస్తుందనేది ఆయన అభిప్రాయం.
వచ్చే ఏడాది లేదా రెండు సంవత్సరాల్లో లెవల్ త్రీ ప్రోగ్రామర్ల వరకు ఔట్ సోర్సింగ్ కోడర్లు ఉద్యోగం కోల్పోనున్నారని హెచ్చరించారు. ఇక వచ్చే ఐదేళ్లలో ప్రోగ్రామర్ల ఊసే ఉండదని ఆయన బాంబు పేల్చారు. అయితే ఫ్రాన్స్ లాంటి కొన్ని దేశాల్లో మాత్రం డెవలపర్లకు ఇబ్బందులు ఉండవని.. ఇందుకు కారణం ఆయా దేశాల చట్టాలు, నిబంధనలే అని ముస్తాక్ అన్నారు. ఏఐ విస్తరిస్తే... వివిధ దేశాల్లో వివిధ రంగాల్లో వివిధ మార్గాల్లో ఉద్యోగాలపై ప్రభావం పడుతుందన్నారు.
చౌక కార్మికులకు, ప్రోగ్రామర్లకు అనేక బహుళజాతి కంపెనీలకు భారతదేశం ప్రధాన స్థానం. టీసీఎస్ (టాటా కన్సల్టింగ్ సర్వీసెస్) దేశంలోనే అతిపెద్ద ఔట్ సోర్సింగ్ ప్రొవైడర్. ఇన్ఫోసిస్, విప్రో కూడా పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. ఈ కంపెనీలు అన్నీ చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలతో ప్రయోగాలు చేస్తున్నాయి.