Skip to main content

Open-Source AI: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ

ప్ర‌స్తుతం ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఎరా న‌డుస్తోంది. ఎటు చూసినా ఏఐ వార్త‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఏఐతో రూపొందించిన న్యూస్ ప్ర‌జెంట‌ర్ వార్త.. ఏకంగా వైర‌ల‌య్యింది. ఇప్ప‌టికే ఈ ర‌గంలో చాట్ జీపీటీ, గూగుల్ అడుగులు వేశాయి.
Open-Source AI
చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ

తాజ‌గా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా ఏఐ రంగంలో సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను ప్రారంభిస్తున్నట్లు సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ వెల్లడించారు. 

చ‌ద‌వండి: ChatGPT: 20 ప్ర‌శ్న‌ల‌కు అర‌లీట‌ర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే

Open-Source AI

చాట్‌జీపీటీ, బార్డ్‌ చాట్‌బాట్‌లకు కీలకమైన లాంగ్వేజ్‌ మోడల్‌ను ఓపెన్‌ఏఐ, గూగుల్‌ ఇప్పటికే అభివృద్ధి చేశాయి. ఈ రెండు కూడా టెక్నాల‌జీ రంగంలో విశేష ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం కృత్రిమ మేధ రంగంలోకి అడుగుపెట్టిన మెటా.. Llama అనే పేరుతో సరికొత్త లాంగ్వేజ్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది నేరుగా వినియోగదారులకు కాకుండా పరిశోధకులు మాత్రమే ఉపయోగించుకునేలా రూపొందించింది. 

చ‌ద‌వండి: Tech News: ఏ స‌మాచారం కావాల‌న్నా చిటికెలో చెప్పేస్తుంది... పాటలు, క‌విత‌లు కూడా రాసేస్తోంది.. చాట్ జీపీటీపై పూర్తిగా చ‌ద‌వండి

meta

వాణిజ్య అవసరాల నిమిత్తం Llama2 పేరుతో మరో లాంగ్వేజ్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఓపెన్‌సోర్స్‌ ఏఐ మోడల్‌. దీన్ని మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి తీసుకొచ్చింది. న్యూ జనరేషన్‌ ఏఐ మోడల్‌ను తీసుకురావటానికి మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మార్క్‌ జుకర్‌బర్గ్ తాజాగా ప్రకటించారు. అయితే... ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో ఏఐ రంగంలో తన సేవలను మరింత విస్తరించుకునేందుకు తాజాగా మెటాతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

​​​​​​​చ‌ద‌వండి:  Google V/S ChatGpt: నువ్వా నేనా..? గూగుల్ V/S ChatGpt... వెయ్యి భాష‌ల్లో గూగుల్ స్పీచ్ మోడ‌ల్‌

Published date : 19 Jul 2023 06:02PM

Photo Stories