Google V/S ChatGpt: నువ్వా నేనా..? గూగుల్ V/S ChatGpt... వెయ్యి భాషల్లో గూగుల్ స్పీచ్ మోడల్
ఇప్పుడు చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ ఏఐ ఆధారిత యూనివర్సల్ స్పీచ్ మోడల్ (usm)ను యూజర్లకు అందించనుంది.
చదవండి: ఒకే మెయిల్‌తో రూ.90 లక్షలు రాబట్టిన చాట్ జీపీటీ
గూగుల్ డెవలపర్ రోజున స్పష్టత
ఈ ఏడాది మే నెలలో అమెరికా కాలిఫోర్నియా నగరం మౌంటెన్ వ్యూ వేదికగా జరగబోయే గూగుల్ డెవలపర్ డే (Google I/O-Input/Output)లో కంపెనీ భవిష్యత్ లక్ష్యాలు, యూఎస్ఎం మోడల్‌పై స్పష్టత ఇవ్వనుంది. దీంతో పాటు గూగుల్ 20 రకాలైన ఏఐ ఆధారిత ప్రొడక్ట్‌ల గురించి వివరించనున్నట్లు పలు నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చింది.
చదవండి: వెనక్కి తగ్గిన గూగుల్... ప్రస్తుతానికి చాట్‌జీపీటీ దే రాజ్యం
గూగుల్ యూనివర్సల్ స్పీచ్ మోడల్ అంటే?
2022 నవంబర్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ ఏఐ ఆధారిత స్పీచ్‌ను యూజర్లకు అందిస్తామని గూగుల్ తెలిపింది. ఈ ప్రకటనకు కొనసాగింపుగా ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1000 భాషలను ఏఐ పద్దతిలో యూజర్లు వినియోగించుకోవచ్చని తాజాగా తెలిపింది. ఇందుకోసం 300 భాషల్లో 2 బిలియన్ పారమీటర్స్‌లో శిక్షణ ఇచ్చి.. 12 గంటల మిలియన్ గంటల ప్రసంగం, 28 బిలియన్ సెంటెన్స్‌ను తయారు చేసినట్లు గూగుల్ పేర్కొంది.
యూనివర్సల్ స్పీచ్ మోడల్‌తో ఉపయోగాలు
ప్రస్తుతం యూట్యూబ్ యూనివర్సల్ స్పీచ్ మోడల్‌ను వీడియోల్లో క్లోజ్డ్ క్యాప్షన్ కోసం వినియోగిస్తుంది. వీడియోల్లో క్లోజ్డ్ క్యాప్షన్ అంటే డైలాగ్స్‌ను టెక్స్ట్ రూపంలో స్క్రీన్ మీద చూపించడం. ఈ టెక్నాలజీ అటోమెటిక్ స్పీచ్ రికగ్నైజేషన్ (ఏఎస్ఆర్) మీద పనిచేస్తుంది. ప్రస్తుతం,యూఎస్ఎం 100కి పైగా భాషలకు సపోర్ట్ చేస్తున్నట్లు టెక్ దిగ్గజం చెప్పింది. మెటా సైతం ఏఐ ఆధారిత లాంగ్వేజ్‌పై పనిచేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉంది.
చదవండి: 20 నిమిషాల్లో 2 వేల పదాలతో ఎస్సే రాసి రికార్డ్..!
ఇలా ఉపయోగించుకోవచ్చు
గూగుల్ ఈ సాంకేతికతను ఆగ్మెంటెడ్-రియాలిటీ (AR) గ్లాసెస్‌లో ఉపయోగించాలని భావిస్తుంది. కంపెనీ తన ఐ/ఓ 2022 ఈవెంట్లో చూపినట్లుగా ఏఆర్ గ్లాసెస్‌ను ధరిస్తే మనం చూసే ప్రతి దృశ్యాన్ని కావాల్సిన లాంగ్వేజ్‌లలో ట్రాన్సలేట్ అవుతుంది. ఈ టెక్నాలజీ వినియోగంలోకి రావాలంటే ఇంకా మరింత సమయం పట్టనుంది.