Skip to main content

Google Company Earnings: నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?

Google Company Earnings How Google Earns 2 Crore Per Minute  Googles financial statistics

ఏ విషయం తెలుసుకోవాలన్నా.. వెంటనే గూగుల్ సెర్చ్ చేసేస్తారు. ఆలా నేడు గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌గా మారిపోయింది. ఇంతలా అభివృద్ధి చెందిన గూగుల్ నిమిషానికి ఏకంగా రూ.2 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..

గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది యూజర్లను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. అయినప్పటికీ గూగుల్ భారీ మొత్తంలో సంపాదించడానికి ప్రధాన కారణం 'యాడ్స్' (ప్రకటనలు).

Intel Layoff: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కోత!

మనం ఏమైనా తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, కావలసిన సమాచారంతో పాటు యాడ్స్ కూడా కనిపిస్తాయి. ఈ ప్రకటలను ఇచ్చే కంపెనీలు గూగుల్‌కు డబ్బు చెల్లిస్తాయి. దీంతో పాటు గూగుల్ క్లౌడ్ వంటి సేవలను అందిస్తుంది. వీటిని ఉపయోగించుకోవడానికి కూడా యూజర్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

గూగుల్ యూట్యూబ్, ప్లే స్టోర్, మ్యాప్స్ వంటి సేవల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తుంది. ఇలా గూగుల్ ఒక్క సెకనుకు ఏకంగా 333333.33 రూపాయలు, నిమిషానికి రూ. 2 కోట్లు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన గూగుల్ రోజుకు, నెలకు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఊహించుకోవచ్చు.

Published date : 01 Aug 2024 11:28AM

Photo Stories