Skip to main content

Intel Layoff: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కోత!

Intel Layoff Intel Company Layoffs

2024లో కూడా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ తయారీ సంస్థ 'ఇంటెల్' (Intel) కూడా చేరింది.

ఇంటెల్ లాభాలు గణనీయంగా తగ్గడం.. మార్కెట్ వాటాను కోల్పోయిన తర్వాత, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ వారంలోనే వేలాదిమంది ఉద్యోగులను తొలగించున్నట్లు సమాచారం. అయితే ఎంతమందిని తొలగిస్తుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. ఉద్యోగుల తొలగింపులు ఈ వారంలోనే ఉండొచ్చని సమాచారం.

Telangana New Governor: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణస్వీకారం

ఇంటెల్ కంపెనీ సుమారు లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ఇది అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Railway Jobs: రైల్వేలో 7951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే

చిప్ తయారీ రంగంలో ఖర్చులను తగ్గించి రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఇంటెల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈఓ పాట్రిక్ పీ గెల్సింగర్  వెల్లడించారు. కంపెనీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కోసం చిప్‌లను తయారుబ్ చేస్తోంది. ఇతర కంపెనీల కోసం కూడా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలను నిర్మించడంపై దృష్టి సారించింది. సంస్థ ఇటీవల తన తయారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నాగ చంద్రశేఖరన్‌ను నియమించుకుంది.

Published date : 01 Aug 2024 11:07AM

Photo Stories