Skip to main content

Bad News for Bank Employees : బ్యాంక్ ఉద్యోగుల‌కు షాక్‌.. త్వ‌ర‌లో 2 ల‌క్ష‌ల మంది తొలగింపు.. కార‌ణం ఇదే..!

ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో క‌న్నా ఎక్కువ భ‌ద్ర‌త బ్యాంకింగ్ రంగంలో ఉంటుందని అనేక‌మంది ఉద్యోగులు భావిస్తారు.
Bloomberg intelligence shocks bank employees with its survey  shocking news for bankemployess

సాక్షి ఎడ్యుకేష‌న్: ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో క‌న్నా ఎక్కువ భ‌ద్ర‌త బ్యాంకింగ్ రంగంలో ఉంటుందని అనేక‌మంది ఉద్యోగులు భావిస్తారు. ఇక్క‌డ ఎటువంటి లేఆఫ్స్ ఉండ‌వు, పూర్తి భ‌ద్ర‌త‌తో ఉద్యోగులు వారి పనిని చేసుకోవ‌చ్చు అని న‌మ్ముతారు. అయితే, తాజాగా నిర్వ‌హించిన ఒక సర్వేలో వీటికి భిన్నంగా ప‌రిస్థితులు ఉన్నాయ‌ని తేలింది. ఎలాంటి మార్పులు వచ్చిన ఐటీ వంటి రంగాల్లో ఉద్యోగాల కోత ఉంటుంది కానీ బ్యాంకింగ్ లో అలాంటి పరిస్థితి ఉండదని చాలా మంది అనుకుంటారు.

బిందాస్‌గా..

చాలామంది బ్యాంక్ ఉద్యోగం అన‌గానే బిందాస్‌గా ఉంటుంది, వీకెండ్ సెల‌వులు, పండుల‌కు సెల‌వులు, సాయంత్రం కాగానే బ్యాంకులు మూసేస్తారు అని ఎన్నో ర‌కాలుగా అనుకుంటారు. ముఖ్యంగా ప్రస్తుతం రెండో శనివారం, ఆదివారం సెలవు ఉండగా. త్వరలోనే వారానికి రెండు రోజులు సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Top Medical College : ఎయిమ్స్‌తో పోటీ ప‌డుతున్న బెస్ట్ మెడిక‌ల్ కాలేజీ.. ఫీజు ఎంతో తెలుసా..!!

దీంతో బ్యాంక్ ఉద్యోగాలపై మరింత క్రేజ్ పెరిగింది. ఇలా, బ్యాంకు ఉద్యోగుల‌కు వారానికి రెండు రోజులు సెలవులు ఉంటాయని వారు ఆనందించేలోగానే ఒక షాకింగ్ వార్త‌ను విన్నారు బ్యాంక్ ఉద్యోగులు. ఏంటా వార్త, అస‌లు ఆ సర్వేలో తేలిన సంచలన విషయాలు ఏంటి.?? అనే అనేక విష‌యాల‌ను ఈ స్టోరీతో తెలుసుకుందాం..

దాదాపు 2 ల‌క్ష‌లు..

తాజాగా, నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం, రానున్న 3 నుంచి 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులను తొల‌గించే అవకాశం ఉందని ప్ర‌ముఖ వ్యాపార సంస్థ‌ బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే తేల్చింది. రొటీన్ వర్క్ చేసే ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తేలింది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చెబుతున్నారు. స‌ర్వేలో తేలిన మ‌రో ముఖ్య‌మైన విషయం ఏంటంటే.. బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని, ఈ ఉద్యోగాలు ఏఐ భర్తీ చేయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇలా, ఆ సంస్థ నిర్వ‌హించిన ఒక్క స‌ర్వేలో ఎన్నో సంచ‌ల‌న‌ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

TG Entrance exams: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈఏపీసెట్ ప‌రీక్ష ఎప్పుడంటే!

బ్యాంకింగ్‌లో స‌మూల మార్పులు..

కస్టమర్ సర్వీస్‌లో త్వరలో పెద్ద మార్పులు రానున్నాయి. ముఖ్యంగా కేవైసీ వెరిఫికేషన్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేయనుంది. దీంతో ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగుల ప్రమాదంలో ఉన్నాయని సర్వే చెబుతోంది. గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఐటీ వినియోగం పెరుగుతోంది. దీంతో సహజంగానే బ్యాంకింగ్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది.

స‌ర్వే గురించి నోట్జెన్ వ్యాఖ్య‌లు..

తాజాగా నిర్వ‌హించిన స‌ర్వే గురించి బ్లూమ్ బెర్ట్ ఇంటెలిజెన్స్ సీనియర్ విశ్లేషకుడు, రచయిత థామస్ నోట్జెన్ మాట్లాడుతూ.. ఒకే పనిని పలుసార్లు చేసే ఉద్యోగుల భద్రత ప్రమాదంలో ఉందని చెప్పుకొచ్చారు.  
కృత్రిమ మేధ‌ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని వ‌స్తున్న వార్త‌ల‌కు కాదని సమాధానం ఇచ్చారు. కానీ, శ్రామిక శక్తిని కొత్త పుంతలు తొక్కిస్తుందన్న‌ ఆయన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇక‌ రానున్న కొన్ని సంవ‌త్స‌రాల‌ల్లో బ్యాంకింగ్ రంగంలో పెను విప్లవాలు వస్తాయని, ఈ మార్పు ప్రపంచమంతా కనిపిస్తుందని తేల్చి చెప్పేసారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Jan 2025 01:13PM

Photo Stories