Inter Board Exams 2025 : ఇంటర్ పరీక్షలకు పఠిష్ట ఏర్పాట్లు.. ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తప్పనిసరి..
![AP intermediate practical and public exams 2025 AP Inter Board exams preparations under guidance of Collector P. Ranjitbasha](/sites/default/files/images/2025/01/30/ap-inter-exam-2025-1738211602.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: మార్చి నెలలో ప్రారంభం కానున్న ఏపీ ఇంటర్ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని, అలాగే, బోర్డు పరీక్షలకు ముందే నిర్వహించే ప్రాక్టికల్స్‌కు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పఠిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం, జనవరి 28వ తేదీన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్ ప్రాక్టికల్స్, ప్రధాన పరీక్షల నిర్వహణపై ఆయా సిబ్బందులతో కలెక్టర్ సమవేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
91 పరీక్ష కేంద్రాలు..
ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్, మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షలు జరిగేలా షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు కలెక్టర్. ప్రాక్టికల్స్ కోసం 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అందులో 15,194 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇబ్బందులు లేకుండా..
ప్రధాన పరీక్షల కోసం 69 సెంటర్లను ఏర్పాటు చేయాలని, ఇందులో మొదటి సంవత్సరం నుంచి 45,325 మంది, రెండో సంవత్సరం నుంచి 22,227 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఆయా విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా సరైన వెలుతురు, గాలి వచ్చేలా చూడాలని, కరెంట్, ఫ్యాన్‌లు, టేబుళ్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశ్న పత్రాల భద్రతకు ఆర్మ్‌డ్‌గార్డులతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్ల నియామకంపై దృష్టి సారించాలని డీవీఈఓకు సూచించారు.
AP Intermediate Time Table Released 2025: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
144 సెక్షన్..
ప్రశ్న పత్రాలను తీసుకెళ్లేపాయింట్ నుంచి కేంద్రాల వరకు ప్రశ్న పత్రాలను పోలీసు బందో బస్తు మధ్య తీసుకెళ్లేలాచర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూయించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.
Free laptop fake news: ఉచిత ల్యాప్‌టాప్ కోసం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్..ఈ విషయం గమనించండి?
8 పరీక్షా కేంద్రాలకు బస్సులు నడిపే అవసరం ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులును ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వోబీకే వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఎస్పీ బాబుప్రసాదు, ఆర్‌ఐఓ గురయవ్య, డీవీఈఓ పరమేశ్వరరెడ్డి, పరీక్షల స్పెషలాఫీసర్ లాలెప్ప పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Inter Exams
- inter practical and public exams 2025
- ap inter exams preparations
- inter exams preparations
- exam centers for public exams
- practical and public exams 2025
- AP education department
- junior college students
- students education
- ap inter exams updates 2025
- ap inter public exams updates 2025
- AP Inter Board
- Education News
- Sakshi Education News
- APBoard2025