Skip to main content

Free laptop fake news: ఉచిత ల్యాప్‌టాప్ కోసం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్..ఈ విషయం గమనించండి?

Free laptop fake news   Fake social media news alert about AICTE free laptop scheme
Free laptop fake news

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం పథకాలు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలు, స్కాలర్‌షిప్‌లు, క్విజ్‌లు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రోత్సహం పొందుతున్నారు. పలు పథకాలు విదేశాల్లో చదవడానికి ఇంటర్న్‌షిప్‌లను కూడా అందిస్తున్నాయి. అయితే, కొందరు అసత్య ప్రచారాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.


10వ తరగతి ఇంటర్‌, డిగ్రీ అర్హతతో AIIMS లో 4,576 ఉద్యోగాలు జీతం నెలకు 92,300: Click Here

ఉచిత ల్యాప్‌టాప్ పథకం నిజమా?
"కేంద్రం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్ ఇస్తోంది" అనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ ప్రచారంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ (AICTE) విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందజేస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే విషయాలను తెలియజేస్తున్నారు. అయితే, ఇది అబద్ధపు ప్రచారం అని స్పష్టమైంది.

AICTE సర్క్యులర్ ప్రకటన
2024 నవంబర్ 27న, AICTE ఒక అధికారిక సర్క్యులర్ ద్వారా ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.

సర్క్యులర్ ప్రకారం:
"సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో ఫేక్ న్యూస్ ప్రచారం అవుతోంది. AICTE విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెప్పడం అబద్ధం. ఇది పూర్తిగా తప్పు. ఈ పథకానికి AICTEకి ఎలాంటి సంబంధమూ లేదు."
"AICTE విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికే ఎటువంటి పథకాన్ని ప్రారంభించలేదు."
"ఈ ప్రచారంలో పేర్కొన్న విధానం పూర్తిగా నకిలీది."

విద్యార్థులకు AICTE సూచనలు
నకిలీ వార్తలను నమ్మవద్దు: ఇలాంటి తప్పుడు వార్తలను విస్మరించాలని విద్యార్థులు, విద్యాసంస్థలు, ప్రజలకు AICTE సూచించింది.
ప్రమాణబద్ధమైన సమాచారం మాత్రమే నమ్మండి:
AICTE అధికారిక వెబ్‌సైట్‌
అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న సమాచారం
ఎటువంటి చెల్లింపులు చేయవద్దు: ఎవరైనా ఇలాంటి తప్పుడు పథకాలను ప్రోత్సహిస్తూ డబ్బు అడిగితే, చెల్లించవద్దు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై జాగ్రత్త
ఈ తప్పుడు ప్రచారాలు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరియు వెబ్‌సైట్లలో జరుగుతుండటంతో విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబితే, వెంటనే నిర్ధారించుకోవడం మంచిది.

ముఖ్య సూచన
ప్రభుత్వ పథకాలు, నోటిఫికేషన్లు, ఆఫర్లు వంటి సమాచారం అధికారిక పోర్టల్ లేదా ప్రామాణిక వనరుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. కేంద్రం ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ పేరుతో ఎలాంటి వార్త వచ్చినా, దానిని నిర్ధారించకుండా నమ్మవద్దు.

Published date : 29 Jan 2025 09:57AM

Photo Stories