13,000 Jobs Fake Notification: 13,762 ఉద్యోగాలంటూ ప్రచారం.. అదంతా ఫేక్ నోటిఫికేషన్

ఈ నోటిఫికేషన్ చూసిన పలువురు ఉద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తుండగా అసలు విషయం బయటపడింది. ఇదంతా ఫేక్‌న్యూస్ అని, నకిలీ నోటిఫికేషన్ అని తేలింది.
Major Vacancies In AIIMS: దేశ వ్యాప్తంగా ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ని ఈ నోటిఫికేషన్ గురించి సంప్రదించగా, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చేశారు. దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
13,762 పోస్టులు.. అంతా ఫేక్
నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ (NRDRM), మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 13,762 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ అంటూ ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. ఇందులో..
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ఫెసిలిటేటర్స్‌కు రూ.22,750, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.23,250, ఫీల్డ్ కోఆర్డినేటర్‌కు రూ.23,250, మల్టీ టాస్కింగ్ అఫిషియల్‌కు రూ.23,450, ఎంఐఎస్ అసిస్టెంట్‌కు రూ.24,650, ఎంఐఎస్ మేనేజర్‌కు రూ.25,650, అకౌంట్ ఆఫీసర్‌కు రూ.27,450, డేటా మేనేజర్‌కు రూ.28,350, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.30,750, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.36,769.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24-02-2025 అంటూ ఫేక్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఫ్యాక్ట్ చెక్‌లో ఇది అబద్దపు ప్రచారం అని తేలిపోయింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- National Rural Development and Recreation Mission
- Fake News
- real or fake news
- TGPSC fake news
- NRDRM fake notification
- Government job applications
- Government job application
- Government Job Fraud notification
- Government job applications
- Government job application
- Government Job Fraud notification
- NRDRM Fake Job Notification
- National Rural Development and Recreation Mission
- National Rural Development and Recreation Mission fake notification
- 13
- 762 Government Jobs Scam
- NRDRM Fake Recruitment Circular
- Fact Check