Top Medical College : ఎయిమ్స్‌తో పోటీ పడుతున్న బెస్ట్ మెడికల్ కాలేజీ.. ఫీజు ఎంతో తెలుసా..!!
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్ పూర్తి చేసుకున్న తరువాత మెడిసిన్ చదవాలనుకున్న విద్యార్థులు ఉత్తమ కళాశాలలో లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధం అవుతారు. ఇలా, బెస్ట్ ఎడ్యుకేషన్ పొందేందుకు బెస్ట్ యూనివర్సిటీల్లో సీటు సాధించాలనే ప్రయత్నిస్తారు. అయితే, ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్టు ప్రకారం, మొదటి స్థానంలో ఢిల్లీలోని ఎయిమ్స్ యూనివర్సిటీ ఉంది. రెండో స్థానంలో చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరో ఉత్తమ వైద్య కళాశాలగా నిలిచింది.
అయితే, వీటికి పోటీగా మరీ ముఖ్యంగా ఎయిమ్స్‌కు పోటీగా మరో మెడికల్ కాలేజీ నిలిచింది. అదే మూడో స్థానంలో ఉన్న తమిళనాడులోని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఎంతో కష్టపడి ఉన్నత మార్కులు సాధిస్తే కాని, ఈ యూనివర్సిటీలో సీటు దక్కదు. అయితే, ఈ యూనివర్సిటీలో చేరేందుకు ఉండాల్సి అర్హతలు, కట్టాల్సిన ఫీజు తదితర వివరాలను ఒకసారి తెలుసుకుందాం..
ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందడం కష్టం. ఇందులో ప్రవేశాం పొందేందుకు విద్యార్థులు నీట్ యూజీలో చాలా మంచి స్కోరును సాధించాలి. ఇక్కడ, ఫీజులు కూడా చాలా ప్రభుత్వ వైద్య కళాశాలల ఫీజు కంటే తక్కువ ఉంటుంది. ఈ కారణాలతోనే దేశంలోని మెడికల్ కళాశాలలో అగ్ర జాబితాలో నిలిచింది.
అర్హతలు..
తమిళనాడులో ఉన్న ఈ క్రిస్టియన్ మెడికల్ కలేజీలో సీటు సాధించాలంటే, విద్యార్థులు నీట్ యూజీ పరీక్షలో కనీసం 50 శాతం సాధించాలి. వయసులో కూడా 17 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్‌మెంట్ కోటా..
క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో, 50% MBBS సీట్లలో అడ్మిషన్ మేనేజ్‌మెంట్ కోటా ద్వారా జరుగుతుంది. మిగిలిన 50 శాతం సీట్లు ప్రభుత్వ కోటా నుండి వస్తాయి. దాని గణితం ఈ క్రింది విధంగా ఉంది-
-50 శాతం సీట్లు రాష్ట్ర కోటా నుండి. వీటిలో 30% సీట్లు రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి భర్తీ చేయబడతాయి.
-రాష్ట్ర ప్రభుత్వంలోని క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులకు 20 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి.
BEL Job Notification : బెల్‌లో 40,000 జీతంతో జాబ్ నోటిఫికేషన్.. అర్హులు వీరే..!
ఫీజు వివరాలు..
మొదటి సంవత్సరం మొత్తం ఫీజు రూ. 56,330. ఇందులో..
ట్యూషన్ ఫీజు: రూ. 3,000
ప్రవేశ రుసుము: రూ. 16,660
ఇతర వార్షిక రుసుములు: రూ. 22,235
విశ్వవిద్యాలయానికి ఒకేసారి చెల్లింపు: రూ. 14,435
మొత్తం: రూ. 56,330
ఇది కాకుండా, మగ విద్యార్థులు రూ. 10,000, మహిళా విద్యార్థులు రూ. 8,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఏది తిరిగి రాదు. అదే సమయంలో, పురుషుల జీవన వ్యయం దాదాపు రూ. 8,000, మహిళలకు రూ. 6,000 ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Top Medical Colleges
- NIRF Rankings 2024
- top medical college admissions
- top 5 medical colleges in india
- AIIMS Delhi
- christian medical college admissions
- best medical colleges in india
- christian medical college tamil nadu
- India's Top Medical Colleges
- christian minority
- medical colleges admission fees
- fees details for christian medical college admissions 2025
- top 3 medical college
- Postgraduate Institute of Medical Education and Research
- top 2 medical colleges in india
- National Institutional Ranking Framework
- National Institutional Ranking Framework 2024
- Top 5 Medical Colleges in NIRF Rankings 2024
- Education News
- Sakshi Education News
- BestMedicalUniversities
- TopMedicalColleges
- MedicalCollegeRankings