Skip to main content

Govt Junior College Students : క‌ళాశాల‌ల‌కు దూరం అవుతున్న విద్యార్థులు.. రోజురోజుకి ప‌డిపోతున్న హాజ‌రు శాతం.. కార‌ణం!!

చ‌దువుకోవాలి అని చెప్పాల్సిన త‌ల్లిదండ్రులే వారికి వేర్వేరు ప‌నులు నేర్పించి ప‌నుల‌కు పంపుతున్నారు.
Presence and negligence of government junior college students

సాక్షి ఎడ్యుకేష‌న్: చ‌దువుకోవాలి అని చెప్పాల్సిన త‌ల్లిదండ్రులే వారికి వేర్వేరు ప‌నులు నేర్పించి ప‌నుల‌కు పంపుతున్నారు. దీంతో, విద్యార్థులు పాఠ‌శాల‌ల‌కు, క‌ళాశాల‌ల‌కు డుమ్మా కొడుతున్నారు. ఇప్ప‌టికే జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో విద్యార్థుల హాజ‌రు శాతం అంతంత‌మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఇలా, బ‌డికి రాకుండా ఉంటే మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఎంతైనా ఉంటుంది.

TS EAPCET Schedule 2025 : బ్రేకింగ్ న్యూస్‌.. ఈఏపీసెట్‌-2025తో పాటు వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ప్ర‌క‌ట‌న‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

మ‌రో రెండు నెల‌ల్లో అంటే మార్చిలో ఇంట‌ర్ విద్యార్థుల‌కు బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మ‌యంలో ప్రిప‌రేష‌న్ చేసుకోరాకుండా వారిని ఇలా ప‌నుల‌కు పంపితే విద్యార్థుల ఉత్తీర్ణ‌త శాతం మ‌రింత త‌గ్గుతుంది. ఇలాగే కొన‌సాగితే, రానున్న విద్యాసంవ‌త్స‌రాల్లో విద్యార్థుల హాజ‌రు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

50 శాతం హాజురు..

ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి 24 వరకు జరగనున్నాయి. స‌మ‌యం కొంత ప్రిప‌రేష‌న్ మాత్రం ఎంతో ఉంది. ఇటువంటి స‌మ‌యంలో స‌ర్కార్ జూనియ‌ర్ క‌ళాశాల‌లోని విద్యార్థుల‌ను వారి త‌ల్లిదండ్రులు డుమ్మా కొట్టించి.. కొంద‌రు పత్తి ఏరడానికి, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారు ఇప్పపువ్వు, బీడీ ఆకు సేకరణ పనులకు, జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు, గట్టు ప్రాంతాల్లోని విద్యార్థుల‌నూ ఏదో ఒక ప‌నికి వెళ్లాల‌ని జోరు పెంచుతున్నారు. ఇలా ఉంటే, విద్యార్థులు ప‌రీక్ష‌కు సిద్ధం అవ్వ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. విద్యార్థులు ఉద‌యం స‌మ‌యంలో క‌ళాశాల‌కు హాజ‌రైనా, 50 శాతంలోనే ఉంటారు. అదే మ‌ధ్యాహ్నం అయితే మాత్రం మ‌రింత త‌గ్గుతారే కాని, పెర‌గ‌రు. ఇదిలాగే, కొన‌సాగ‌డంతో కళాశాలలోని అధ్యాప‌కులు, ప్రిన్సిపాళ్లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Jan 2025 11:17AM

Photo Stories