TG EAPCET 2025: ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్..... త్వరలో నోటిఫికేషన్ .... మరో ఏడు సెట్స్ తేదీల వెల్లడి

హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి వెల్లడించారు. దీంతో పాటు ఈ ఏడాది నిర్వహించే మరో ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను బుధవారం ప్రకటించారు. సెట్ కన్వీనర్లు, సెట్లను నిర్వహించే యూనివర్సిటీల వివరాలను ఇదివరకే ప్రకటించారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
ఈ ఏడాది తెలంగాణ కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం(జనవరి15) ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్(EAPCET), మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్,జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్
జూన్ 8,9 న ఐసెట్,జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్,జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జేఎన్‌టీయూ(హెచ్),ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కన్వీనర్‌లుగా వ్యవహరించనున్నాయి. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.
వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2025 ఇదే ...: ఏఏ పరీక్ష ఎప్పుడంటే...?
➤ ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ
➤ మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్
➤ మే 12న ఈసెట్
➤ జూన్ 1న ఎడ్‌సెట్
➤ జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్
➤ జూన్ 8,9 తేదీల్లో ఐసెట్
➤ జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు
➤ జూన్ 11 నుంచి 14 వరకు టీజీ పీఈసెట్
ఇదీ చదవండి: EAMCET Mathematics Bitbank
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- EAPCET 2025
- Telangana Council of Higher Education
- Telangana higher education exams
- EAPCET exam dates
- Telangana entrance exam schedule
- EAPCET exam 2025
- TS EAPCET Schedule 2025 Released News
- ts entrance exams for engineering 2025 schedule release date news in telugu
- EAPCET Schedule 2025
- entrance exams 2025
- TelanganaHigherEducationCouncil
- EAPCETExamDates
- TelanganaExams2025
- EAPCET2025Timetable
- TelanganaExamination