ChatGpt: దూసుకెళుతోన్న చాట్‌జీపీటీ... 20 నిమిషాల్లో 2 వేల పదాలతో ఎస్సే రాసి రికార్డ్..!
తాజాగా 20 నిమిషాల్లో ఏకంగా 2 వేల పదాల వ్యాసాన్ని రాసి మరొక విశ్వ విద్యాలయ పరీక్ష పాస్ అయిందట. ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, పీటర్ 2000 పదాల వ్యాసాన్ని వ్రాయమని ChatGpt ని ఆదేశించాడు. ఆశ్చర్యకరంగా, ఏఐ చాట్‌జీపీటీ దానిని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసింది. దానిని ఉపాధ్యాయులకు చూపించి వాల్యుయేషన్ చేయాలని అడిగాడు. ఉపాధ్యాయులు ఆ వ్యాసానికి 53, 2:2 స్కోరు ఇచ్చారు.
చదవండి: చాట్ జీపీటీకి గూగుల్ షాక్....బార్డ్‌తో చాట్‌జీపీటీకి చెక్..?
కొంచెం సంక్షిష్టం...
వ్యాసంలోని పదాల అమరిక కొంచెం సంక్షిష్టంగా ఉందని, అయితే ఇది ఏమంత ఇబ్బందికరంగా లేదని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనికి తగినంత విశ్లేషణ అవసరమన్నారు. అంతేకాదు లేజీ స్టూడెంట్స్ వర్క్‌ను గుర్తు చేసిందని సరదాగా పేర్కొన్నారు. గత ఏడాది గ్రాడ్యుయేట్ అయిన పీటర్... స్నెప్‌వాంజర్స్, ప్రోగ్రామ్‌తో ప్లగరిజం సాధ్యమేనా అని పరీక్షించడానికి ఒక వ్యాసాన్ని రూపొందించడానికి ChatGPT AI ని టెస్ట్ చేశారట.
చదవండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్ చేస్తోన్న చాట్‌జీపీటీ
ఇదే మొదటిసారి కాదు....
చాట్‌జీపీటీ టూల్ కీలకమైన టెస్ట్‌లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష, వార్టన్ బిజినెస్ MBA ప్రోగ్రామ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు చివరి పరీక్ష,యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా లా స్కూల్ నాలుగు స్కూల్ పరీక్షలతో సహా కొన్ని ప్రముఖ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. మిన్నెసోటా యూనివర్శిటీ లా స్కూల్ ప్రొఫెసర్ జోనాథన్ చోయ్, 95 బహుళఎంపిక ప్రశ్నలు, 12 వ్యాస ప్రశ్నలతో కూడిన విద్యార్థులకిచ్చే పరీక్షనే చాట్‌జీపీటీకి ఇచ్చారు. బోట్ మొత్తం C+ స్కోర్ చేసినట్లు నివేదించారు. వినియోగదారులతో సాధారణ చాట్‌లలో పాల్గొనడం , వివిధ రకాల ప్రశ్నలకు ప్రతిస్పందించే సామర్థ్యంతో, ChatGPT చాట్‌బాట్ విపరీతంగా ఆకర్షిస్తోంది.
చదవండి: ఫ్యూచర్ అంతా మెటావర్స్‌దే...