1 Crore Package: ఎల్పీయూ విద్యార్థికి రూ.కోటి ప్యాకేజీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ప్లేస్‌మెంట్ ప్యాకేజీలో సత్తాచాటింది.

తమ క్యాంపస్ 2025 బీటెక్ ఫైనల్ ఇయర్ బ్యాచ్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి ఏఐ రోబోటిక్స్ కంపెనీలో రూ.1.03 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినట్లు ఎల్పీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్‌కుమార్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: NTPC jobs: బీటెక్ అర్హతతో NTPCలో ఉద్యోగాలు.. జీతం నెలకు 1,00,000
పాలో ఆల్టో నెట్‌వర్క్స్, న్యూటనిక్స్, మైక్రోసాఫ్ట్, సీఐఎస్‌సీఓ, పాయల్, అమెజాన్ వంటి పలు ప్రముఖ కంపెనీల నుంచి మొత్తం 7,361 జాబ్ ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించారు. 1,700 మందికి పైగా విద్యార్థులు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్న ప్లేస్‌మెంట్స్ పొందినట్లు వెల్లడించారు. ఆదిరెడ్డి వాసుకు ఏకంగా ఏడు జాబ్ ఆఫర్లు వచ్చాయన్నారు. తమ విద్యార్థులు విజయం సాధించేందుకు ఎల్పీయూ కృషి చేస్తుందన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 12 Feb 2025 10:15AM