Skip to main content

PM Narendra Modi: హరియాణాలో నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్‌ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి ఏప్రిల్ 14వ తేదీ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ శంకుస్థాపన చేశారు.
PM Narendra Modi lays foundation stones for development projects in Haryana

అనంతరం హిసార్‌–అయోధ్య మధ్య తొలి కమర్షియల్‌ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్‌ జిల్లాలోని దీనబందు చోటూ రామ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్‌ మోడ్రన్‌ థర్మన్‌ పవర్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. 

మోదీ ప్రసంగంలోని ముఖ్యాశాలు.. 
కాంగ్రెస్‌పై విమర్శలు: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు రాజ్యాంగాన్ని ఉపయోగించిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విస్మరించిందని మోదీ విమర్శించారు.
అంబేడ్కర్, చరణ్ సింగ్‌కు భారతరత్న: అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న పురస్కారాలు కాంగ్రెస్ ఇవ్వలేదని, బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు.

PM Modi: రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన‌ మోదీ

వక్ఫ్ చట్టం సవరణ: వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకు ఉపయోగపడకుండా భూమాఫియాకు ఉపయోగపడ్డాయని, అందుకే వక్ఫ్ చట్టాన్ని సవరించామని మోదీ వివరించారు.
సామాజిక న్యాయం: పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మోదీ తెలిపారు.
విమాన ప్రయాణం: సాధారణ ప్రజలు కూడా విమానాలలో ప్రయాణించేలా చేయడమే తమ లక్ష్యమని, గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారని చెప్పారు.
ఎయిర్‌పోర్టుల అభివృద్ధి: 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 150కి చేరిందని తెలిపారు.

PM Mudra Yojana: పీఎం–ముద్రా యోజనకు దశాబ్దం పూర్తి.. ఈ పథకం కింద 52 కోట్ల మంది లబ్ధిదారులు..

Published date : 16 Apr 2025 10:07AM

Photo Stories