Skip to main content

Google V/S Chat GPT: వెనక్కి తగ్గిన గూగుల్‌... ప్రస్తుతానికి చాట్‌జీపీటీ దే రాజ్యం

కొన్ని రోజులుగా నెట్టింట ఎటుచూసినా చాట్‌ జీపీటీ గురించే చర్చ. కొన్ని పరీక్షలను అలవోకగా పాసైంది తన సత్తా చాటుకుంది. ఎవరూ ఏ ప్రశ్న అడిగినా అత్యంత నాణ్యమైన సమాచారాన్ని సెకండ్లలోనే మన ముందుంచి ఔరా అనిపించింది.
chat GPT

అయితే తనకు ఎక్కడ పోటీగా నిలుస్తుందోనన్న భయంతో గూగుల్‌ త్వరగా కూసేసింది. అది ఇప్పుడు అడ్డం తిరిగింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.  
100 బిలియన్ల డాలర్లు ఆవిరి
మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జీపీటీకి పోటీగా ఏఐ ఆధారిత  ‘బార్డ్‌’ చాట్‌బాట్‌ టూల్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది. ముందుగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే గూగుల్‌ బార్డ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌ విడుదల కోసం రూపొందించిన ప్రమోషనల్‌ వీడియోలో తప్పిందంతో.. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది.

google ceo

చ‌ద‌వండి: 20 నిమిషాల్లో 2 వేల పదాలతో ఎస్సే రాసి రికార్డ్‌..!
అందరి వేళ్లు సుందర్‌పిచాయ్‌ వైపే...
ప్రమోషనల్‌ వీడియోలో చోటుచేసుకున్న తప్పుకు కారణం సీఈవో సుందర్‌ పిచాయ్‌ అని ఆ కంపెనీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పలు నివేదికలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆల్ఫాబెట్‌ చైర్మన్‌  జాన్‌ హెన్నెస్సీ బాట్‌ విడుదలపై స్పందించారు. కాల్ఫిపోర్నియాలో నిర్వహించిన ఓ సమ్మిట్‌లో జాన్‌ హెన్నెస్సీ బార్డ్‌పై స్పందించారు. ‘బార్డ్‌ అద్భుతమైన టెక్నాలజీ. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఒకటి నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంద’ని అన్నారు.
ఇక్కడే తప్పులో కాలేసింది....
జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్‌ తప్పుగా సమాధానం ఇవ్వడంపై ఆల్ఫాబెట్‌ షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఈ సమ్మిట్‌లో మైక్రోసాఫ్ట్‌ చాట్‌జీపీటీ కంటే ముందుగా బార్డ్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో గూగుల్‌ తొందర పడిందనే విషయాన్ని హెన్నెస్సీ అంగీకరించారు. బార్డ్‌ ఇప్పటికీ తప్పుడు సమాధానాలను ఇస్తుండడంతో దీన్ని మరింతగా తీర్చిదిద్దేపనిలో గూగుల్‌ ఉన్నట్లు హెన్నెస్సీ పేర్కొన్నారు.

చ‌ద‌వండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ

Published date : 14 Feb 2023 07:06PM

Photo Stories