Apprenticeship Mela: 14న పాత ఐటీఐలో అప్రెంటిస్‌షిప్ మేళా
Sakshi Education
కంచరపాలెం: కంచరపాలెంలోని ప్రభుత్వ పాత ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 14న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా–2023 నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జె. శ్రీకాంత్, జోన్–4 ఉపసంచాలకుడు ఆర్.జి.రమణ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, ఐటీఐ పూర్తి చేసిన అన్ని ట్రేడుల అభ్యర్థులు, ఇంటర్మీడియట్ ఓకేషనల్ ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఎస్‌సీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో కోరమండల్, మైలాన్, వరుణ్ మోటార్స్, జయభేరి, జిందాల్ స్టీల్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు 18కి పైగా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు బయోడేటా, ధ్రువీకరణపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు.
Published date : 12 Aug 2023 02:34PM