Skip to main content

Job Notification : డీసీసీబీల్లో 251 ఖాళీలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

251 posts applications at dccb for unemployees  CCB job vacancies in Guntur, Krishna, Srikakulam, and Kurnool districts

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలోని గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డీసీసీబీల్లో ప‌లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వాటిని భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు డీసీసీబీ బృందం. ఇందులో మొత్తం 251 ఖాళీలు ఉన్నాయి.

IIST Recruitment 2025: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

అందులో 50 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉండ‌గా ఈనెల 22లోగా నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు అధికారులు. అప్లికేషన్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700 మిగతా వారికి రూ.500 ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని ఇన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. 

అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్‌..

ఈ క్ర‌మంలోనే ఏపీ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగంలో 142 పోస్టులు భ‌ర్తీకి సిద్ధంగా ఉండ‌గా, అందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కూడా విడుద‌ల చేశారు. కృష్ణా జిల్లాలోని హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సహాయకుడు, అటెండర్, టెక్నీషియన్ వంటి పోస్టుల కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Jan 2025 09:52AM

Photo Stories