Apprentice Mela: 14న అప్రెంటిస్ షిప్ మేళా
రాప్తాడురూరల్: అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈనెల 14న ఉదయం 9 గంటలకు అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సి.రామమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు పదో తరగతి, ఐటీఐ మార్క్ మెమోలు, ఎన్‌టీసీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డ్, ఫొటోలు, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్/రేషన్‌కార్డ్, బ్యాంకు పాస్‌బుక్, కులధ్రువీకరణ పత్రం మూడుసెట్లు తీసుకుని హాజరుకావాలని సూచించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల అధికారులు, యాజమాన్యాలు పాల్గొని వారికి అవసరమైన ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పించాలని ప్రిన్సిపాల్ రామమూర్తి కోరారు.
Job Mela in Andhra Pradesh: రేపు రాజంపేటలో జాబ్‌మేళా
11న గుంతకల్లు ఐటీఐలో జాబ్‌మేళా
అశోక్‌లేల్యాండ్ కంపెనీలో జూనియర్ టెక్నీషియన్ల ఉద్యోగాల భర్తీకి ఈనెల 11న గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నారని అనంతపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. జీతం నెలకు రూ. 12 వేలు, వసతి కల్పిస్తారన్నారు. అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.