Skip to main content

Job Mela in Andhra Pradesh: రేపు రాజంపేటలో జాబ్‌మేళా

Job Mela in Rajampet Andhra Pradesh

రాజంపేట టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న న్యాక్‌ కేంద్రంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ది సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌ మేళాలో బహుళ జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ప్రతిభగల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఏదేని డిగ్రీ, ఏదేని పీజీ, ఐటీఐ, డిప్లొమా, నర్శింగ్‌ వంటి కోర్సులు ఉత్తీర్ణులై 18 నుంచి 30 ఏళ్లలోపు వారు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు WWW.aprrdc.in వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను రిజిస్టేషన్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8897776368, 7093618420 నెంబర్‌లలో సంప్రదించాలని తెలిపారు.

Mega Job Mela in YSR District: YSR జిల్లా ప్రొద్దుటూరులో మెగా జాబ్ మేలా!

Published date : 10 Aug 2023 03:40PM

Photo Stories