Skip to main content

106 Staff Nurse Posts : 106 స్టాఫ్ నర్సు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు.. ఎన్ని రోజులంటే..

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది వైద్య ఆరోగ్య శాఖ‌. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్టాఫ్ న‌ర్సుల‌కు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Applications deadline extended for staff nurse posts  Staff Nurse Vacancies in Uttarandhra Districts

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది వైద్య ఆరోగ్య శాఖ‌. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్టాఫ్ న‌ర్సుల‌కు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానిస్తోంది వైద్య ఆరోగ్య శాఖ‌. ఇందులో మొత్తంగా, 106 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఉన్నాయి. వీట‌ని భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావ‌డం ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో 7,400 దరఖాస్తులు అందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ పి.రాధారాణి తెలిపారు.

BEL Jobs Notification: బెల్‌ చెన్నైలో 83 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.17,500 జీతం..

ముందుగా ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రకటించినప్పటికీ.. సంక్రాంతి కారణంగా ఈ గడువును మ‌రో రెండు రోజుల‌కు పెంచి ఈ నెల 17వ తేదీ చివ‌రి తేదీగా ప్ర‌క‌టించారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ తేదీలోగా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు, రేసవానిపాలెం, డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని తమ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https:// nagendrasvst.wordpress.com/ లేదా https://cfw.ap.nic.in సంప్రదించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Jan 2025 03:56PM

Photo Stories