Skip to main content

Free Current: దేశ ప్రజలందరికీ ఉచిత కరెంట్.. కేంద్ర ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకోండిలా..

Free Current  Central Government Rooftop Solar Panel Scheme for free electricity
Free Current

దేశంలోని కోటి గృహాలకు సోలార్ ప్యానెల్ అమర్చి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనుంది కేంద్రం. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? అర్హతలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 67,000: Click Here

పథకం వివరాలు
దేశ ప్రజలంతా ఉచిత విద్యుత్ పొందాలనే సంకల్పంతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్‌ (Rooftop solar scheme) ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చారు.

పథకం పేరు మరియు లక్ష్యం
ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన. దీని ద్వారా దేశంలోని కోటి గృహాలకు సోలార్ ప్యానెల్ అమర్చి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు వారికి సంపాదన మార్గం కూడా చూపించడం ప్రభుత్వ టార్గెట్.

బడ్జెట్ మరియు ప్రారంభం
గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ స్కీం కోసం బడ్జెట్‌లో రూ.75,021 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగమైన వారి ఇంటి పై కప్పుపై సోలార్ ప్యానెల్ బిగించి.. వాటి ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు.

కేంద్ర ఆర్థిక సహాయం
ప్రతి ఒక్క కుటుంబం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను స్వీకరించేలా ప్రోత్సహించడానికి కేంద్ర ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లు విద్యుత్ బిల్లులపై గణనీయమైన పొదుపును అందిస్తాయి. అదేవిధంగా మిగులు విద్యుత్‌ను డిస్‌కమ్‌లకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తాయి.

ఖర్చులు మరియు సబ్సిడీ వివరాలు
ఇంటి పైకప్పుపై 3 kW సోలార్ ప్యానల్స్ బిగించడానికి దాదాపు 1 లక్ష 80 వేలు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 78 వేలు. మిగితా మొత్తం EMI పద్దతిలో చెల్లించవచ్చు. ఈ పథకంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్‌ను పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

సబ్సిడీ వివరాలు
1 kW వ్యవస్థకు రూ. 30,000, 2 kW వ్యవస్థకు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సిస్టమ్‌లకు రూ. 78,000 సబ్సిడీ ఇస్తున్నారు.

దరఖాస్తు ఎలా చేయాలి
జాతీయ రూఫ్‌టాప్ సోలార్ పోర్టల్ pmsuryaghar.gov.inని విజిట్ చేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న క్యూరేటెడ్ జాబితా ఓ విక్రేతను ఎంచుకోండి. ఈ విక్రేతలు ఇప్పటికే నాణ్యత, విశ్వసనీయతను నిర్ధారిస్తూ స్థానిక డిస్కమ్‌లతో నమోదు చేసుకున్నారు.

అర్హతలు
మీ కుటుంబం గతంలో సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్‌ల కోసం సబ్సిడీని పొంది ఉంటే వారికి ఈ పథకం వర్తించదు.

సమగ్ర వృద్ధి
ఈ పథకం తయారీ, లాజిస్టిక్స్, ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్స్, సంబంధిత సేవలు వంటి రంగాల్లో 17 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. ఇది ఆర్థిక వృద్ధిని పెంచడమే కాకుండా భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

Published date : 16 Jan 2025 08:29AM

Photo Stories