Skip to main content

Republic Day Celebrations in Schools : పాఠశాల‌ల‌కు స‌ర్కార్ కీల‌క ఆదేశాలు.. గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఇవి త‌ప్ప‌నిస‌రి..

దేశ‌వ్యాప్తంగా జ‌నవ‌రి 26వ తేదీన గ‌ణతంత్ర దినోత్స‌వం జ‌రుపుకుంటాం.
Grand celebrations of republic day in schools

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశ‌వ్యాప్తంగా జ‌నవ‌రి 26వ తేదీన గ‌ణతంత్ర దినోత్స‌వం జ‌రుపుకుంటాం. అయితే, ఏపీ స‌ర్కార్ ప్రతీ పాఠ‌శాల‌ల‌కు కీల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది. ఆరోజు జాతీయ సెల‌వు కాగా, ప్ర‌తీ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థులు, అధ్యాప‌కులు, ప్ర‌ధానోపాధ్యాయులు, త‌దిత‌ర యాజ‌మాన్యాలు కూడా పాల్గొని ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వహించాల‌ని తెలిపారు.

Republic Day: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల థీమ్

వివిధ కార్యక్ర‌మాలు..

జ‌న‌వ‌రి 26వ తేదీన గ‌ణతంత్ర దినోత్స‌వం.. ఆ రోజున అన్ని పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామారావు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌తీ విద్యాసంస్థ‌ల‌ హెడ్మాస్టర్లు అలాగే ప్రధాన అధికారులు ఈ వేడుకల్లో కచ్చితంగా పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని హుకుం జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాక ఆవిష్కరణ చేస్తారని ప్ర‌క‌టించారు.

25% Seats for Poor Students : 25 శాతం పేద‌ల‌కే.. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచే ఈ చ‌ట్టం అమ‌లు..!!

గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ గీతాన్ని పాడడం.. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసే కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించాల‌ని, విద్యార్థులు మంచి గీతాల‌ను, నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు, ప్ర‌త్యేక‌మైన నాటకాలు ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, హెడ్మాస్ట‌ర్లు వంటి అధికారులు పాల్గొని కార్య‌క్ర‌మాన్నివియ‌వంతం చేయాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Jan 2025 03:36PM

Photo Stories