Guest Faculty Jobs: గెస్ట్ లెక్చరర్ల భర్తీకి ఇంటర్వ్యూ.. పూర్తి వివరాలివే!
Sakshi Education
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డా.బీఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడి)గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Guest Faculty Jobs Guest lecturers vacancies
సంబంధిత పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అయితే 50 శాతం మార్కులు వచ్చి ఉండాలని పేర్కొన్నారు. సబ్జెక్ట్‌లో ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఈనెల 24వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. 25వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.
ముఖ్య సమాచారం:
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు విద్యార్హత: పీజీలో 55% ఉత్తీర్ణత దరఖాస్తుకు చివరి తేది: జనవరి 24
ఇంటర్వ్యూ ఎప్పుడు: జనవరి 25న ఇంటర్వ్యూ ఎక్కడ: డా.బీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల, మహబూబ్‌నగర్.