Skip to main content

All Colleges Bandh : కాలేజీలు బంద్ చేస్తాం... కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి.
all colleges bandh due to fee reimbursement problems  Private colleges in Telangana warn of indefinite closure over pending fee reimbursement dues

అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి.

☛➤ RRB Group D Jobs 2025 Full Details : రైల్వేలో 32,438 ఉద్యోగాల‌కు అర్హ‌త‌లు ఇవే.. ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. కానీ జీతం మాత్రం..

డిగ్రీ, పీజీ కాలేజీలకు..
ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు విన్నవించాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఫీజు బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని కోరాయి. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ, పీజీ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గత కొంతకాలంగా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, దీంతో సిబ్బంది జీతభత్యాలు, కాలేజీ భవనాల అద్దెలు చెల్లించలేక పోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి.

అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే కాలేజీలను బంద్ చేస్తామని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు ప్రైవేటు కాలేజీలు తేల్చి చెప్పాయి. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాయి.

Published date : 24 Jan 2025 08:42AM

Photo Stories