Skip to main content

Contract and Outsourcing Jobs: 10వ తరగతి అర్హతతో AP కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Contract Outsourcing Jobs  Andhra Pradesh medical and health department recruitment notification  10th class qualification jobs in Andhra Pradesh health department  AP recruitment notification for medical jobs with 10th qualification
Contract Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వైద్య , ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో కేవలం పదో తరగతి , డిగ్రీ, డిఫార్మసీ లేదా బీఫార్మసీ , DMLT / BSC MLT వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలు ఉన్నాయి.

10వ తరగతి ఇంటర్ అర్హతలతో ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100: Click Here

ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారు గ్రామాల్లో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు పట్టణాల్లో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో పనిచేయాల్సి ఉంటుంది.


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , ఏలూరు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న పోస్టులు : 
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కు చెందిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, LGS అనే ఉద్యోగాలు మొత్తం 18 ఉన్నాయి.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO) అనే ఉద్యోగాలు మొత్తం 40 ఉన్నాయి.

అర్హతలు : 
ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా అర్హతలు కలిగి ఉండాలి. 
FNO ఉద్యోగాలకు పదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. (FNO ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు)
LGS ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు DMLT లేదా BSc (MLT) విద్యార్హత ఉన్నవారు అర్హులు.
ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు డిఫార్మసీ లేదా బీఫార్మసీ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కంప్యూటర్స్ ఒక సబ్జెక్టు కలిగిన ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఒక సంవత్సరం PGDCA కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రెండు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 58 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 
ఇందులో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో 40 పోస్టులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో 18 పోస్టులు ఉన్నాయి.

వయస్సు : 
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 
SC, ST, BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
District Medical & Health Officer, ఏలూరు జిల్లా, ఏలూరు అనే పేరు మీద DD రూపంలో చెల్లించాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-01-2025 తేదీ నుండి ఏలూరులో ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. 

అప్లికేషన్ చివరి తేదీ : 03-02-2025 తేదీలోపు ఏలూరులో ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీస్ లో అప్లికేషన్ అందజేయాలి.

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. 
అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, అనుభవానికి మార్కులు కేటాయించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ నింపి, అభ్యర్థులు అప్లై చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ మరియు ఇతర సర్టిఫికెట్స్ పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేయాలి మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడి ని కూడా జతపరిచి అప్లై చేయాలి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం , ఏలూరు, ఏలూరు జిల్లా నందు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి.

Download Full Notification: Click Here

Official Website: Click Here

Published date : 24 Jan 2025 08:36AM

Photo Stories