Skip to main content

SBI Life Work From Home jobs: 10వ తరగతి అర్హతతో SBI Life లో Permanent Work From Home ఉద్యోగాలు

SBI Life Work From Home jobs  Apply now for SBI Life Insurance Life Mitra   10th Class Qualification requirement
SBI Life Work From Home jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance) నుండి లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన వారు చక్కగా తమ ఇంటి నుండే ఈ పని చేసుకోవచ్చు.

అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 67,000: Click Here

అసలు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు అంటే ఏమిటి ? చేయాల్సిన పని ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపికైతే జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి అప్లై చేయండి. లేదా మీకు దగ్గరలో ఉండే SBI Life Insurance ఆఫీస్ లో సంప్రదించండి.

భర్తీ చేసే ఉద్యోగాలు : లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు : కేవలం పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర అనే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇతర విద్యార్హతలు మరియు అనుభవం అవసరం లేదు. 

జీతం: 
ఎంపికైన వారు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కు చెందిన పాలసీలు చేసిన దానిపై కమిషన్ వస్తుంది. ఒక పాలసీ చేస్తే 30% వరకు కమిషన్ పొందే అవకాశం ఉంది. తరువాత పాలసీ తీసుకున్న వినియోగదారులు వాళ్లు చెల్లించే ప్రీమియంపై కూడా కొంత కమిషన్ ఇస్తారు. ఇంతే కాకుండా ఇతర చాలా రకాల బెనిఫిట్స్ మరియు రివార్డ్స్ కూడా ఈ సంస్థ ఇస్తుంది. మీరు అప్లై చేసుకుంటే వారే మీకు పూర్తి వివరాలు అన్ని తెలియజేస్తారు. కమిషన్స్‌ బెనిఫిట్స్ మరియు రివార్డ్స్ అన్ని కలుపుకోని నెలకు 35,000 వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉండోచ్చు.

కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

ఎంపిక విధానం : 
ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీవారు సంప్రదించి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. SBI Life Insurance Advisor గా పని చేయాలి అంటే IRDAI నిర్వహించే పరీక్ష పాస్ అవ్వాలి.

అప్లై విధానం: 
ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు. కాబట్టి వివరాలు అన్ని స్పష్టంగా నమోదు చేయండి.

ఉద్యోగం – భాద్యతలు :
ఈ పోస్టులకు ఎంపికైన వారు తనకు తెలిసిన వారిని సంప్రదించి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియచేసి పాలసీలను విక్రయించాలి. ఇలా చేయడం వలన ఒక్కో పాలసీపై మంచి కమిషన్ ఇస్తారు. ఈ పాలసీలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు సంస్థ ప్రతినిధులు తెలియజేస్తారు. పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ 25 గంటలు ట్రైనింగ్ కూడా అందిస్తారు.
మంచి పనితీరు చూపించిన వారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పించవచ్చు.

ట్రైనింగ్ సమయం : ఈ పోస్టులకు ఎంపికైన వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇస్తారు. 

టార్గెట్స్ ?: ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీకు మీరే టార్గెట్స్ పెట్టుకుని పని చేస్తే ప్రతి నెల బాగా సంపాదించే అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 
జాబ్ లోకేషన్ : Work from home (చక్కగా ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవచ్చు). మీకు తెలిసిన స్నేహితులు , బంధువులు మరియు ఇన్సూరెన్స్ పాలసీ అవసరమయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కోసం తెలియజేసి , అందులో ఉన్న పాలసీలను అమ్మడం ద్వారా అధిక ఆదాయం సంపాదించవచ్చు. దీనికోసం మీరు ప్రతిరోజు ఆఫీస్ కి ఆఫీస్ కు వెళ్ళనవసరం లేదు. 


Apply Online: Click Here

Published date : 17 Jan 2025 08:32AM

Photo Stories