Skip to main content

Indian Army Recruitment 2023: టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ స్వాగతం పలుకుతోంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్‌.. శాశ్వత ప్రాతిపదికన 2024 జనవరిలో ప్రారంభించే 138వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ)కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. ఇలా కొలువు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి.
technical graduate course in indian army 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 40 (సివిల్‌-11, కంప్యూటర్‌ సైన్స్‌-09, ఎలక్ట్రికల్‌-04, ఎలక్ట్రానిక్స్‌-06, మెకానికల్‌-08, మిసిలేనియస్‌-02)
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న,అవివాహితులైన పురుష అభ్యర్థు­లు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనవరి 01, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మార్కులకు కట్‌ ఆఫ్‌ నిర్ణయిస్తారు. దాన్ని బట్టి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు(ఎస్‌ఎస్‌బీ).. బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొదటి రోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌(ఇంటెలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారినే స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.

శిక్షణ ఇలా: ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్‌లో శిక్షణ ఉంటుంది. కోర్సు కాలవ్యవధి 49వారాలు.శిక్షణలో చేరినప్పటి నుంచే లెఫ్టినెంట్‌ హోదా ఇస్తారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్సీ) నిబంధనల ప్రకారం-వేతనం అందుతుంది. ఆ సమయంలో నెలకు రూ. 56,100చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసు కున్న అభ్యర్థులు శాశ్వత కమిషన్‌ పరిధిలోకి వస్తారు.

వేతనాలు: శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిన వారికి లెవల్‌-10 ప్రకారం మూలవేతనం లభిస్తుంది. ఇలా ఎంపికైన వారికి ప్రతి నెల రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 అందుతాయి.వీటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి. ఈ కొలువులో చేరిన వారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను అందుకోవచ్చు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 2023, మే 17 మధ్యాహ్నం 3 వరకు.
  • వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

చ‌ద‌వండి: Railway Jobs: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, బిలాస్‌పూర్‌లో 548 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories