Indian Army Jobs 2023: ఉచితంగా బీటెక్ చదువుతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు.. నెలకు రూ.లక్ష వేతనం
ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారికి నెలకు రూ.లక్ష వేతనం లభిస్తుంది.
మొత్తం ఖాళీలు: 90
అర్హతలు: జేఈఈ మెయిన్ 2023లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. 2 జనవరి 2005- 1 జవనరి 2008 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక ఇలా
ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొదటి రోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటెలిజెన్స్) పరీక్షల్లో అర్హత సాధించిన వారిని స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షలో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.
చదవండి: Indian Army: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ కోర్సు శిక్షణలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ-గయాలో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్ ట్రైనింగ్ పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట శిక్షణ కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు..ఫేజ్-1 మూడేళ్ల ప్రీ కమిషన్ ట్రైనింగ్, ఫేజ్-2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి.
బీటెక్
నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదా సొంతమవుతుంది. ట్రైనింగ్, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజనీరింగ్(బీటెక్) డిగ్రీని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.
వేతనాలు
లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేరిన వారికి లెవల్-10 ప్రకారం మూలవేతనం లభిస్తుంది. ఇలా ప్రతి నెల రూ.56,100తో పాటు మిలటరీ సర్వీస్ పే కింద రూ.15,500 అందుతాయి. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర ప్రోత్సాహకాలు లభిస్తాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే వీరు అన్ని కలుపుకుని సీటీసీ రూపంలో నెలకు దాదాపు లక్ష రూపాయాలు అందుకోవచ్చు.
ఉన్నత హోదాలు
ఈ పోస్టులకు ఎంపికైన వారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను అందుకోవచ్చు.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 12, 2023
వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/
Qualification | 12TH |
Last Date | November 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Indian Army Jobs 2023
- Defence Jobs
- defence jobs after 12th
- Defence Jobs in India
- Army Jobs After Inter
- Careers
- Free Engineering in Indian Army
- Engineering
- MPC students
- Inter
- Indian Army 10+2 Technical Entry Scheme
- latest job notifications
- Employment News
- latest jobs in telugu
- IndianArmy
- TESRecruitment
- EducationOpportunity
- LieutenantRank
- FreeBtechEducation
- ArmyCommission
- IndianArmyNotification
- sakshi education job notifictions
- latest jobs in 2023