Indian Coast Guard Recruitment: కోస్ట్‌గార్డ్‌లో కమాండెంట్ పోస్టులు... దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
దేశ భద్రత వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే పట్టభద్రుల కోసం భారతీయ తీర రక్షణ దళం(ఇండియన్ కోస్ట్‌గార్డ్) ప్రకటన వచ్చేసింది. 01/2023 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ దరఖాస్తులను కోరుతుంది. ఇంటర్‌తోపాటు డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశ సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ భారతీయ తీర గస్తీ దళం(ఇండియన్ కోస్ట్ గార్డ్). దేశ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థను 1978 ఆగస్టు 18 పార్లమెంట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. తీర ప్రాంత భద్రత, కృత్రిమ ద్వీపాల రక్షణ, సముద్రంలో మత్స్యకారులు, నావికులకు రక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నియంత్రణ తదితర వంటి బాధ్యతలను ఇండియన్ కోస్ట్‌గార్ట్ నిర్వహిస్తోంది.
- పోస్టులు: అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్)
- విభాగాలు: జనరల్ డ్యూటీ (జీడీ)(పైలట్/నావిగేటర్),జనరల్ డ్యూటీ(ఉమెన్ ఎస్‌ఎస్‌ఏ),కమర్షియల్ పైలెట్ లైసెన్స్(ఎస్‌ఎస్‌ఏ), టెక్నికల్(మెకానికల్),టెక్నికల్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్).
అర్హతలు
- జనరల్ డ్యూటీ(జీడీ/పైలెట్/నావిగేటర్):
అర్హత: కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌తోపాటు బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 01.07.1998 నుంచి 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి. - జనరల్ డ్యూటీ(ఉమెన్ ఎస్‌ఎస్‌ఏ):
అర్హత: కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌తోపాటు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 01.07.1998 నుంచి 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి. - కమర్షియల్ పైలట్ లైసెన్స్(ఎస్‌ఎస్‌ఏ) (మేల్/ఫిమెల్):
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య జన్మించి ఉండాలి. - టెక్నికల్(మెకానికల్)(మేల్):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 01.07.1998 నుంచి 30.06.2002మధ్య జన్మించి ఉండాలి. - లా ఎంట్రీ(మేల్/ఫిమేల్): కనీసం 60శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు: 01.07.1993 నుంచి 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం
దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్టులను నిర్వహించి.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
స్క్రీనింగ్ టెస్ట్
దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. లా ఎంట్రీ అభ్యర్థులు, డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ అభ్యర్థులు మినహజీడీ/పీఎన్/సీపీఎల్/ఎస్‌ఎస్‌ఏ(ఉమెన్)/టెక్నికల్(మెకానికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) విభాగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకున్న పోస్టులను బట్టి అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. విభాగాన్ని బట్టి మొత్తం 100 ప్రశ్నలకు గాను 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కును కోతగా విధిస్తారు. మల్టిపుల్ చాయిస్ పద్దతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
షార్ట్‌లిస్ట్
స్క్రీనింగ్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష
మెంటల్ ఎబిలిటీ టెస్ట్/కాగ్నిటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్ ఇంగ్లిష్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్ ప్రక్రియకు ఎంపిక చేస్తారు.
ఫైనల్ సెలక్షన్
ఫైనల్ సెలక్షన్‌లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి. చివరి దశలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్‌కి పిలుస్తారు.
వేతనాలు
లెవల్ పే 10 ప్రకారం వేతనాలు చెల్లిస్తారు. వీరికి ప్రారంభ వేతనం నెలకు రూ.56,100 అందుతుంది. వీటితోపాటు అలవెన్సులు ఇతర ప్రోత్సహాకాలు లభిస్తాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2022
- వెబ్‌సైట్: http://www.joinindiancoastguard.cdac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |