Indian Army Recruitment 2022: ఆర్మీ–ఈస్టర్న్ కమాండ్‌లో 158 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్, కోల్‌కతాలోని కమాండ్ హాస్పిటల్ పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 158
పోస్టుల వివరాలు: బార్బర్–09, చౌకీదార్–12, ఎల్‌డీసీ–03, సపాయివాలా–35, హెల్త్ ఇన్‌స్పెక్టర్–18, కుక్–03, టీ/మేట్–08, వార్డ్ సహాయక్–53, వాషర్‌మెన్–17.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన, ఉత్తీర్ణతతో పాటు సూచించిన ట్రేడ్/కోర్సు సర్టిపికేట్లు ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్, కమాండ్ హాస్పిటల్, అలిపోర్, కోల్‌కతా–700027 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Assam Rifles Recruitment: 1380 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |