Skip to main content

Army Jobs: ఆర్మీలో 419 పోస్టులు.. రాత పరీక్ష ఇలా..

దేశ రక్షణ రంగానికి తమ సేవలను అందించాలనుకునే పట్టభద్రులకు చక్కటి అవకాశం! సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ సెంటర్‌.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.
AOC Recruitment 2022 For Material Assistant Jobs

పోస్టులు: మెటీరియల్‌ అసిస్టెంట్‌-419
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ లేదా డిప్లొమా ఇంజనీరింగ్‌/డిప్లొమా (మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలను అనుసరించి రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ
శారీరక దారుఢ్యం/స్కిల్‌టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. ఎంపికైన వారిని ఆల్‌ ఇండియా సర్వీస్‌ కింద ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

చ‌ద‌వండి: 24,369 Constable Jobs In SSC: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

రాత పరీక్ష ఇలా
ఈ పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు-150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు- 25 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ల నుంచి 50 మార్కులకు-50 ప్రశ్నల చొప్పున ఉంటాయి. 
 
ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 12.11.2022
  • వెబ్‌సైట్‌: https://www.aocrecruitment.gov.in/

చ‌ద‌వండి: AOC Recruitment 2022: ఆర్మీ ఆర్డ్‌నెన్స్‌ కార్ప్స్, సికింద్రాబాద్‌లో 419 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories