Specialist Officer Posts: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 190 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ప్రభుత్వరంగ బ్యాంకు.. పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1, 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1, 2.
మొత్తం పోస్టుల సంఖ్య: 190
పోస్టుల వివరాలు: అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్–100, సెక్యూరిటీ ఆఫీసర్–10, లా ఆఫీసర్–10, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్–10, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్–30, డీబీఏ (ఎంఎస్‌ఎస్‌క్యూఎల్/ఒరాకిల్)–03, విండోస్ అడ్మినిస్ట్రేటర్–12, ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్– 03, నెట్‌వర్క్–సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్–10, ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ –02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 20ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఐబీపీఎస్ ద్వారా నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా సమయం 60 నిమిషాలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.09.2021
వెబ్‌సైట్: https://www.bankofmaharashtra.in/
Qualification | GRADUATE |
Last Date | September 19,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |