SBI Recruitment: ఎస్‌బీఐలో 606 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 606
పోస్టుల వివరాలు: రిలేషన్‌షిప్ మేనేజర్–314, రిలేషన్‌షిప్ మేనేజర్(టీం లీడ్)–20, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్–217, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్–12, సెంట్రల్ రీసెర్చ్ టీం(ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్)–04, మేనేజర్ మార్కెటింగ్–12, డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్–26, ఎగ్జిక్యూటివ్(డాక్యుమెంట్ ప్రిజర్వేషన్)–01.
అర్హతలు: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్,ఫుల్‌టైం ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 23 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/ఆన్‌లైన్ టెస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021
వెబ్‌సైట్: https://bank.sbi/web/careers
Qualification | GRADUATE |
Last Date | October 18,2021 |
Experience | 1 year |
For more details, | Click here |