Skip to main content

Bank of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో.. 376 రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులు..

Bank of Baroda

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్‌... బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. బీఓబీకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.  ఆసక్తి, అర్హతలు ఉన్న వారు డిసెంబర్‌ 9 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య: 376
  • పోస్టుల వివరాలు: సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–326, ఈవెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–50.

ప్రాంతాల వారీగా పోస్టులు

  • సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–326: హైదరాబాద్‌–12, అహ్మదాబాద్‌–25, అలహాబాద్‌–05, బెంగళూర్‌–32, చెన్నై, కోయంబత్తూర్‌–04, ఫరీదాబాద్‌–04, ఘజియాబాద్‌–08, గూర్గాం–04,  ఇండోర్‌–02, జైపూర్‌–05, జోద్‌పూర్‌–03, కాన్పూర్‌–05, కోల్‌కతా–04, లక్నో–06, లుథియానా–02,  ముంబై–91, నాగ్‌పూర్‌–04, న్యూఢిల్లీ–43, నోయిడా–04, పుణే–10, రాజ్‌కోట్‌–07, సూరత్‌–11, ఉదయ్‌పూర్‌–02, వారణాసి–03, వడోదర–18.
  • ఈవెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: ముంబై–50. 

పోస్టులు–అర్హతలు

  • సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రెండేళ్ల ఫుల్‌టైమ్‌ పీజీ పూర్తిచేసి ఉండాలి. లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చేసి ఉండాలి. అలాగే రెగ్యులేటరీ సర్టిఫికే షన్‌లు తప్పనిసరి. ఉదాహరణకు ఎన్‌ఐఎస్‌ఎం/ఐఆర్‌డీఏ వంటివి. 
  • వీటితోపాటు ప్రభుత్వ/ప్రయివేట్‌ బ్యాంక్స్‌ లేదా ఇతర ఆర్థిక సంస్థలో రిలేషన్‌షిప్‌ మేనేజర్లుగా వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
  • వయసు: 01.11.2021 నాటికి 24–35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈవెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రెండేళ్ల ఫుల్‌టైమ్‌ పీజీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసి ఉండాలి. అలాగే రెగ్యులేటరీ సర్టిఫికే షన్‌లు తప్పనిసరి. ఉదాహరణకు ఎన్‌ఐఎస్‌ఎం/ఐఆర్‌డీఏ వంటివి. 
  • ఏడాదిన్నర పాటు ప్రభుత్వ/ప్రయివేట్‌ బ్యాంక్‌ లేదా ఇతర ఆర్థిక సంస్థలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
  • వయసు: 01.11.2021 నాటికి 23–35 ఏళ్ల మధ్య వారై ఉండాలి. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.  

ఎంపిక ప్రక్రియ

  • షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు సిటీ/లొకేషన్‌ వైజ్‌గా మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.  
  • అలాగే ఈవెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు ఆల్‌ ఇండియా స్థాయిలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఒప్పంద ప్రాతిపదికన
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన అయిదేళ్ల పాటు సంబంధిత ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయిదేళ్ల అనంతరం బ్యాంక్‌ అవసరాలకు అనుగుణంగా ఒప్పంద గడువు పెంచే అవకాశం కూడా ఉంది.

దరఖాస్తు ఇలా

  • ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి 
  • దరఖాస్తులకు చివరి తేదీ: 09.12.2021
  • వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/Careers.htm

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 09,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories