Skip to main content

Bank of India Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 18 సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

Bank of India

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖండ్వా జోనల్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్‌ కమ్‌ గార్డెనర్‌–06, ఆఫీస్‌ అటెండెంట్‌–03, ఆఫీస్‌ అసిస్టెంట్‌–06, ఫ్యాకల్టీ–03.
ఖాళీలున్న ప్రదేశాలు: ఖండ్వా, ఖార్గోన్, బుర్హాన్‌పూర్‌.
అర్హత: ఎనిమిదో తరగతి, పదో తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ (బీఎస్‌డబ్ల్యూ/బీఏ/బీకాం) ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, హిందీ, కంప్యూటర్‌ నైపుణ్యాలు, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్‌/ప్రజంటేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జోనల్‌ మేనేజర్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఖండ్వా జోనల్‌ ఆఫీస్, ఆనంద్‌నగర్, ఖండ్వా –450001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.09.2021

వెబ్‌సైట్‌: www.bankofindia.co.in
 

Qualification DIPLOMA
Last Date September 08,2021
Experience Fresher job

Photo Stories