Skip to main content

TSPSC & APPSC Groups: గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు.. మెంటల్ ఎబిలిటీస్‌ను ఎలా చ‌ద‌వాలంటే..?

ప్రస్తుతమున్న పోటీ పరీక్షల్లో అర్థమెటిక్, రీజనింగ్ లేని పరీక్షలు చాలా తక్కువ. గుమస్తా ఉద్యోగం నుంచి సివిల్స్ వరకూ.. ఏ పరీక్షను చూసినా అర్థమెటిక్, రీజనింగ్‌లకు అధిక ప్రాధాన్యముంది.
mental ability topics for group exams
Mental Ability Topics

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించిన సిలబస్‌లో కూడా వీటికి సముచిత స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు అర్థమెటిక్, రీజనింగ్‌లకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధమవ్వాలి, ఏయే అంశాలపై అవగాహన పెంచుకోవాలో తెలియజేస్తూ టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యులు డాక్టర్ బైరి ప్రభాకర్ అందిస్తున్న సూచ‌న‌లు- స‌ల‌హాలు మీకోసం..

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

50 మార్కులకు..
అభ్యర్థుల్లో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఉండాల్సిన మానసిక సామర్థ్యాన్ని (మెంటల్ ఎబిలిటీస్/జనరల్ ఎబిలిటీస్) పరీక్షించేందుకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల సిలబస్‌లో మెంటల్ ఎబిలిటీస్ /జనరల్ ఎబిలిటీస్‌ను చేర్చింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఇతర గెజిటెడ్ (ఏఈఈ, లెక్చరర్‌‌స), నాన్ గెజిటెడ్ (ఏఈ) జాబ్స్‌కు జనరల్ స్టడీస్‌లో భాగంగా మెంటల్ ఎబిలిటీస్ సబ్జెక్ట్ ఉంది. గ్రూప్-1 మెయిన్‌లో ప్రత్యేకంగా పేపర్-5లో 50 మార్కులకు ‘డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్’ పై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. జనరల్ స్టడీస్‌లో భాగంగా ఉన్న జనరల్ ఎబిలిటీస్‌లో ముఖ్యంగా మూడు భాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు.
➤ లాజికల్ రీజనింగ్
➤ అనలిటికల్ ఎబిలిటీ
➤ డేటా ఇంటర్‌ప్రిటేషన్

TSPSC Group 1 Notification: 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ప్రాక్టీస్ టెస్ట్స్, గైడెన్స్ వివరాలు 

జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులకు ఉంటే.. దాదాపు 10 శాతం అంటే 15 మార్కుల వరకు మెంటల్ ఎబిలిటీస్/జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. లాజికల్ రీజనింగ్‌లో వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా..
1. స్టేట్‌మెంట్ (ప్రకటన), రెండు అసెంప్షన్‌‌స (భావించిన అంశాలు) ఇస్తారు. ఇచ్చిన ప్రకటన, భావించిన అంశాలను పరిశీలించి ప్రకటన చేయడానికి సరిపోయిన అంశం లేదా అంశాలను గుర్తించాల్సి ఉంటుంది.
2. ఒక ప్రకటన (స్టేట్‌మెంట్), రెండు నిర్ణయాలు (కన్‌క్లూజన్స్) ఇస్తారు. ఇచ్చిన ప్రకటన పూర్తి నిజంగా భావిస్తూ, ఏ నిర్ణయాలు ప్రకటన ఆధారంగా, తర్కబద్ధంగా ఉన్నాయో గుర్తించాలి.
3. ఒక ప్రకటన (స్టేట్‌మెంట్), రెండు తీసుకోవాల్సిన చర్యలు (కోర్స్‌ ఆఫ్ యాక్షన్) ఇస్తారు. ఈ తరహా ప్రశ్నల్లో తీసుకోవాల్సిన చర్య ప్రకటనలోని సమస్యకు పరిష్కారం చూపుతూ పాలనా సౌలభ్యంగాను, అమలుకు వీలుగాను ఉండాలి. ప్రకటనను చదివి, తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి ఏ చర్యలు అర్హమైనవో నిర్ణయించాలి.
4. ఒక ప్రశ్న, రెండు వాదాలు ఇస్తారు. అవి బలమైన వాదం(స్ట్రాంగ్ ఆర్గ్యూమెంట్), బలహీనమైన వాదం(వీక్ ఆర్గ్యూమెంట్). బలమైన వాదాలు ప్రశ్నలోని అంశానికి నేరుగా సంబంధం కలిగి ముఖ్యమైనవిగా ఉంటాయి. బలహీనమైన వాదాలు ప్రశ్నలోని అంశానికి పరోక్ష సంబంధం కలిగి ఉంటాయి లేదా అల్ప ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఇచ్చిన ప్రశ్నలు, వాదాలను పరిశీలించి ఏది బలమైందో / బలహీనమైందో గుర్తించాలి.
5. ఇందులో రెండు సంఘటనలు ఇస్తారు. వాటిని పరిశీలించి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక సంఘటన కారణం(కాజ్) అయితే, మరో సంఘటన దాని ప్రభావం (ఎఫెక్ట్) కావచ్చు. అందులో కారణం, ప్రభావాలను నిర్ణయించాల్సి ఉంటుంది.

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​
       సీటింగ్ అరెంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్ సెన్స్ టెస్ట్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, క్యూబ్స్-అపోజిట్ నంబర్/కలర్, ఈక్వాలిటీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ, వర్డ్‌/అల్ఫాబెట్ బేస్డ్ ప్రశ్నలు, ర్యాంకింగ్.. అనలిటికల్ ఎబిలిటీస్‌లో ముఖ్య అంశాలు. వీటిలో కొన్ని అంశాల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.

TSPSC & APPSC: గ్రూప్స్ ప‌రీక్ష‌ల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో..
1) ఒక టేబుల్, 2) పై చార్ట్‌, 3) గ్రాఫ్ (లైన్ లేదా బార్), 4) ఒక పేరాగ్రాఫ్, 5) రాడార్ గ్రాఫ్ గానీ ఇస్తారు. డేటాను క్షుణ్నంగా చదివి ఇచ్చిన డేటాను విశ్లేషించి పాయింట్స్ నోట్ చేసుకుంటే వీటిలో ఇచ్చే అయిదు ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు.

గ్రూప్-1 మెయిన్‌లో అయిదో పేపర్‌లోని డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో కూడా దాదాపు ఇదే సిలబస్ ఉంటుంది. కానీ ప్రశ్నల తీరు మారుతుంది. ఈ ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ భాగంలో అభ్యర్థి డేటా విశ్లేషణ, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. డేటా విశ్లేషణలో భాగంగా స్టాటిస్టికల్ డేటా టేబుల్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్‌‌టలు ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి ఇచ్చిన డేటాను క్షుణ్నంగా అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సంభావ్యత, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీస్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి నంబర్ సీక్వెన్స్, సిరీస్, సగటు, నంబర్ సిస్టమ్స్, నిష్పత్తులు, లాభ నష్టాలు మొదలైన వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటుగా కాలం-పని, కాలం- వేగం-దూరం, సరళ వడ్డీ, అనలిటికల్, క్రిటికల్ రీజనింగ్‌పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. డెసీషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ఒక పరిస్థితినిచ్చి (స్ట్రక్చర్డ్ సిచ్యూయేషన్) దాని నుంచి వచ్చే సమస్యలకు అభ్యర్థి పరిష్కారాలను సూచించాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థి ఇచ్చిన పరిస్థితిని పూర్తిగా విశ్లేషించి పరిష్కారాలను సూచించాలి. ఈ విధంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ప్రాముఖ్యం ప్రతి పరీక్షకు ఉంటుంది. ఈ విభాగంలో అభ్యర్థులు తక్కువ శ్రమతో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  ​​​​​​​

అభ్యర్థులకు స‌ల‌హాలు..
చాలా మంది అభ్యర్థులు సంఖ్యల మీద భయం ఉండటం వల్ల ఈ విభాగాన్ని కఠినమైనదిగా భావిస్తారు. అలాగే ఇది గణితం, ఇంగ్లిష్‌కు సంబంధించిన సబ్జెక్ట్ అని భావిస్తారు. కానీ కొంత ప్రాక్టీస్ చేయటం ద్వారా దీన్ని కూడా సులభంగా, తక్కువ సమయంలోనే చేయవచ్చు. ఒకసారి శ్రద్ధతో సాధన చేస్తే మంచి మార్కులు సంపాదించటంతో పాటు తుది ఎంపికకు దోహదం చేసే విధంగా ఉంటుంది.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలు

1.సూచనలు: ఈ ప్రశ్నలో ఒక ప్రకటన (స్టేట్‌మెంట్), రెండు ‘భావించిన అంశాలు’ (అసెంప్షన్స్) ఇచ్చారు. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగపడుతూ నిజాలుగా భావించిన అంశాలనే ‘భావించిన అంశాలుగా’ పేర్కొనొచ్చు. ‘భావించిన అంశాల’ ఆధారంగానే ప్రకటన చేస్తారు. ఇచ్చిన ప్రకటన, ‘భావించిన అంశాలను’ పరిశీలించి ప్రకటన చేయడానికి ఏ అంశం లేదా అంశాలు భావించబడ్డాయో గుర్తించండి.
ప్రకటన: చాలా కాలంగా కోరుతున్నప్పటికీ కాలనీలో తపాలా కార్యాలయం ఏర్పాటు చేయలేదు. కాలనీకి దగ్గరలో ఉన్న తపాలా కార్యాలయం సుమారు 4 కి.మీ. దూరంలో ఉంది.
భావించిన అంశం 1: ఈ మధ్య ప్రజలు తపాలా సేవలను ఉపయోగించుకోవట్లేదు.
భావించిన అంశం 2: తమ కాలనీలో తపాలా కార్యాలయం ఉండాలని కాలనీ వాసుల కోరిక.

ఎ) భావించిన అంశం-1 మాత్రమే
బి) భావించిన అంశం-2 మాత్రమే
సి) భావించిన అంశం-1, 2 కావు
డి) భావించిన అంశం-1, 2

Published date : 29 Apr 2022 07:12PM

Photo Stories