TSPSC : టీఎస్‌పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలి.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై..
పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం అనే కారణంతోనే రెండోసారి పరీక్షను రద్దు చేస్తూ.. తిరిగి నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ బోర్డుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా..
TSPSC గ్రూప్-1 రద్దు పై ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఉద్యోగాభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో.. ముందస్తుగా ఓయూ దారులను మూసేశారు అధికారులు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించాల్సిందే.. : NSUI వెంకట్
గ్రూప్ 1 రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎన్‌ఎస్‌యూఐ నేత బాల్మూరి వెంకట్ తెలిపారు. టీఎస్పీఎస్సీ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 లో, బయోమెట్రిక్ విధానం లేకపోవడం,అవకతవకలు జరిగాయని హైకోర్టు భావించి రద్దు చేసింది. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. విద్యార్థులు మనోధైర్యం కోల్పోరాదు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా నిర్వహించాలి.
☛➤ టీఎస్‌పీఎస్సీ Group 1 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అలా చేయకపోతే మంత్రులను అధికారులు ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తాం . గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరాటం అని పేర్కొన్నారు.
☛➤ Competitive Exams: పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్నారా... అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి
రెండోసారి కూడా..
మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లీకేజీ ఆరోపణలతో నేపథ్యంలో కిందటి ఏడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తొలిసారి రద్దయింది. ఈ ఏడాది జూన్ 11న రెండోసారి పరీక్ష జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం.. హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తాజాగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
Tags
- tspsc group 1 cancelled 2023
- TSPSC Group 1 Cancelled news
- tspsc group 1 prelims cancel issue
- tspsc group 1 prelims cancel issue 2023
- tspsc group 1 prelims
- tspsc group 1 prelims 2023
- Telangana High Court cancels tspsc group 1 preliminary exam
- The Telangana High Court has cancelled the TSPSC Group 1 Prelims Exam 2023
- tspsc group 1 prelims exam cancelled
- tspsc group 1 prelims exam problems
- tspsc group 1 prelims exam issues
- Sakshi Education Latest News