APSCHE: ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా రామ్మోహనరావు
Sakshi Education
ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ కె.రామ్మోహనరావుకు మరోసారి (సెకండ్ టర్మ్) అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు జీవో 34ను విడుదల చేశారు. ఈయన పదవీ కాలం మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. కాగా, కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ వై.నజీర్ అహ్మద్‌ను ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు మండలికి లేఖ రాశారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన బి.సుధీర్ ప్రేమ్‌కుమార్ స్థానంలో నజీర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చదవండి:
Published date : 30 Aug 2022 03:46PM