APAAR Id Cards : విద్యార్థులకు అపార్ కార్డులు.. విద్యాశాఖ ఆదేశాలు ఇలా..

సాక్షి ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా విద్యార్థులందరకీ కేంద్ర సర్కార్ అపార్ కార్డులను కేటాయిస్తుంది. విద్యార్థులంతా, తప్పనిసరిగా ఈ కార్డులను పొందాలని సూచిస్తుంది సర్కార్. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఈ 'అపార్ ఐడీ కార్డులను అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి గాను, వచ్చే విద్యాసంవత్సరంనాటికి, అంటే.. జూన్ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని కళాశాలలకు, విశ్వావిద్యాలయాలకు ఇప్పటినకే ఆదేశాలను కూడా జారీ చేసింది కేంద్ర సర్కార్.
ఈ అపార్ కార్డు, 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ.. దీనిని, వన్ నేషన్-వన్ స్టూడెంట్ పేరిట ప్రతీ విద్యార్థికి అందించాలి. దీనిని ప్రతీ విద్యార్థికి అందజేయాలని ఇప్పటికే ప్రతీ కళాశాలకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే ఈ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది.
75 శాతం అపార్‌లు సిద్ధం..
దీనిలో భాగంగా.. ఇప్పటికే అపార్ ఐడీలను రూపొందించడంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అంబేద్కర్ యూనివర్సిటీ, 75 శాతం అపార్ ఐడీలను క్రియేట్ చేసింది. సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కేంద్ర విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాటి… అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అభినందించారు. 100 శాతం అపార్ ఐడీలు అతి త్వరలోనే పూర్తిచేసి రికార్డ్ క్రియేట్ చేయాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- apaar cards
- students id cards
- College and university students
- central government
- college students apaar
- 12 digit number card for students
- Deputy Secretary and Union Ministry of Education Rohit Tripati
- Department of Education
- technical issues
- apaar card registration process
- Ambedkar University
- Ambedkar Open University
- Automated Permanent Academic Account Registry
- APAAR Latest news
- latest updates on apaar cards
- Education News
- Sakshi Education News
- AcademicYear2025
- AparIDCards