School Grants: ఎట్టకేలకు పాఠశాలలకు నిధులు.. దీని ఆధారంగా నిధులు మంజూరు!

ఏటా విడుదలచేసే ఈ కేటాయింపులు ఈసారీ విద్యా సంవత్సరం ముగింపు దశకు విడుదల కావడం గమనా ర్హం. పాఠశాలల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్న సమయంలో ఈ నిధులను విడుదల చేయడంతో నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలు రోజువారీ ఖర్చుల నిమిత్తం డబ్బులు అవసరం ఉంటుండగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని భరిస్తూ వస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలతోపాటు కేజీబీ వీలు, గిరిజన సంక్షేమ తదితర పాఠశాలలకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్, స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో 50 శాతం నిధులు విడుదల చేయగా, తాజాగా 50 శాతం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: NEET Preparation Tips: డాక్టర్ కల నెరవేరేలా!.. సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
30 మంది విద్యార్థులు ఉన్న బడులకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులుఉన్న పాఠశాలలకు రూ.25 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1000 మంది విద్యార్థులు గల బడులకు రూ.75 వేల చొప్పున మంజూరు చేశారు. ఇక స్పోర్ట్స్ గ్రాంట్ కింద కూడా నిధులు మంజూరు అయ్యాయి.
క్రీడా నిధులు కూడా...
జిల్లాలోని ఆయా పాఠశాలలకు వివిధ సంవత్సరంలో స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు మిగతా 50 శాతం తాజాగా ఆయా పాఠశాల అకౌంట్‌లలో జమ చేశా రు. ప్రాథమిక పాఠశాల కోసం రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల కోసం రూ.10 వేలు, ఉన్నత పాఠశాలలకు అయితే రూ.25 వేల చొప్పున చెల్లించారు. విద్యార్థులకు ఆటలు, క్రీడా పరికరాలకు కొనుగోళ్ల కోసం వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
![]() ![]() |
![]() ![]() |
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్...
పదో తరగతి వార్షిక పరీక్షలకు సమాయాత్తమవుతున్న ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 20 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి ప్రతీరోజు రూ.15 ఖర్చు చేయాలని నిర్దేశించింది. ఈ డబ్బులు కూడా స్కూల్‌గ్రాంట్ నిధులతోపాటు విడుదల చేసింది. జిల్లాలో స్నాక్స్ గ్రాంట్ కింద 107 పాఠశాల విద్యార్థుల కోసం రూ.18,38,250 ఆయా పాఠశాలలకు విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలలకు విడుదల
స్పోర్ట్స్ గ్రాంట్, పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ గ్రాంట్ కూడా.. తప్పనున్న బడి నిర్వహణ తిప్పలు.. నిర్మల్ జిల్లాకు రూ.3.32 కోట్లు.. పాఠశాలల వారీగా జమ
జిల్లాలో కేటాయింపులు ఇలా..
జిల్లాలోని మొత్తం ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీవీలు, ఆదర్శ, గిరిజన సంక్షేమ తదితర పాఠశాలలు 818 ఉండగా ఆయా పాఠశాలలకు మొత్తం రూ.3.32 కోట్లు మంజూరయ్యాయి. వాటిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలల అకౌంట్లలో జమ చేశారు.
ఇందులో ఒక్కో పాఠశాలకు బడిబాట గ్రాంట్ కింద రూ.వెయ్యితోపాటు స్కూల్ గ్రాంట్ నిధులు, ఎంపిక చేసిన మరికొన్ని పాఠశాలల బాలికల కోసం ఝాన్సీరాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష కార్యక్రమం కింద ఒక్కో పాఠశాలకు రూ.15 వేలు కేటాయించారు. ఇక వీటికి అదనంగా పదో తరగతి విద్యార్థుల కోసం స్నాక్స్, అదేవిధంగా స్కూల్ సేఫ్టీ కోసం కూడా రూ.500 జమ చేశారు. ప్రతీరోజు పాఠశాలలో చాక్ పీసులు, డస్టర్లు, వాష్‌రూమ్ శానిటైజేషన్ నిమిత్తం ఖర్చులు ఉంటాయి. వీటిని అందుకోసం వినియోగించనున్నారు.
Tags
- School Grants Released
- Govt Educational Institutions
- Department of Education
- Teachers
- Telangana Education Commission
- KGBVs
- Composite School Grants
- Based on the number of students
- School Grants for the year
- Telangana Government
- Finally funding release for telangana schools
- School Grant Guidelines
- Telangana News
- Nirmal District News
- 10th Students Snacks