CPGET: పీజీ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 1న మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
సీపీజీఈటీ–2021లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కనీ్వనర్ పాండురంగారెడ్డి తెలిపారు. పీజీ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆధార్ కార్డుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, తాజాగా ఎమ్మార్వో జారీ చేసిన ఆదాయం సరి్టఫికెట్లను అప్‌లోడ్ చేయాలని సూచించారు.
చదవండి:
Published date : 02 Nov 2021 05:32PM