ఈ మెడల్ ప్యూర్ గోల్డ్
ఒలింపిక్ స్వర్ణం కంటే విలువైనది
ఒలింపిక్ స్వర్ణం ప్రపంచ క్రీడాకారులకు బంగారు కల. ఆ పతకం కోసం ఎంతగానో పోటీ పడుతుంటారు. అందులో బంగారం చాలా తక్కువ పరిమాణంలోనే ఉంటుంది. ఒలింపిక్ స్వర్ణంలో 92 శాతం వెండి, 6 శాతం రాగితో పాటు 2 శాతం పైపూతగా మాత్రమే బంగారం ఉంటుందట. కానీ.. ఐఐఎం అందిస్తున్న ఈ గోల్డ్ మెడల్స్‌ను 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తున్నారు. ఒక్కో పతకం 25 గ్రాముల బంగారంతో 92 శాతం ప్యూరిటీతో తయారు చేశారు. ఒక్కో మెడల్‌కు ఏకంగా రూ.1.12 లక్షల వరకూ ఖర్చు చేశారు. మొత్తం 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.
ఐఐఎం ప్రత్యేకత అదే
విద్యార్థులకు చదువు పట్ల మరింత ఆసక్తి పెంచేందుకు ప్యూర్ గోల్డ్ మెడల్ అందించే విధానాన్ని ఐఐఎంలలో అమలు చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా ప్యూర్ గోల్డ్ మెడల్స్ అందించే విద్యాలయం లేదు. విశాఖ ఐఐఎం మాత్రమే కాదు.. దేశంలోని అన్ని ఐఐఎంలలోనూ ఈ తరహా గోల్డ్ మెడల్స్ అందిస్తున్నాం. ఇదే ఈ విద్యాసంస్థల ప్రత్యేకత. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఈ సంస్కృతి మొదలైంది.
– ప్రొఫెసర్ ఎం చంద్రశేఖర్, డైరెక్టర్, ఐఐఎం విశాఖపట్నం