Skip to main content

CWG 2022 : భారత్ @ 5

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ - 2022లో భారత క్రీడాకారుల అద్భుత ప్రతిభ కొనసాగుతోంది.
India now among top 5 countries
India now among top 5 countries

ఆగస్టు 7 వరకు జరిగిన పోటీల్లో 171 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్, కెనడా రెండూ మూడు స్థానాల్లో ఉన్నాయి. 53 పతకాల ( 18 స్వర్ణాలు)తో భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది.  

ఆగస్టు 6, 7 తేదీల్లో విజేతల వివరాలు 

పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్‌ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్‌ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్‌ (76 కేజీలు), పూజా గెహ్లోత్‌ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 

Also read: World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం

అథ్లెటిక్స్‌ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్‌ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్‌ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్‌ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్‌కిది తొమ్మిదోసారి. తాజా ప్రదర్శనతో అవినాష్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఈవెంట్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత వహించాడు. 

మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రీడల చరిత్రలో రేస్‌ వాకింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది.

Also read: Indian Navy : నేవీలో నారీ ఘనత..

లాన్‌ బౌల్స్‌లో రజతం 
లాన్‌ బౌల్స్‌ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్‌’ ఈవెంట్‌లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్‌ బహదూర్, నవనీత్‌ సింగ్, చందన్‌ కుమార్‌ సింగ్, దినేశ్‌ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్‌ ఐర్లాండ్‌ చేతిలో ఓడిపోయింది.  

Also read:  Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 6th కరెంట్‌ అఫైర్స్‌

ఆగస్టు 7న జరిగిన పోటీల్లో మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్‌... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్‌ పంఘాల్‌ స్వర్ణ పతకాలు సాధించారు. 

Also read: CWG 2022: రెజ్లింగ్ లో భారత్ కు 3 స్వర్ణాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్‌ జరీన్‌ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్‌)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్‌ రెస్టాన్‌ (ఇంగ్లండ్‌)పై... అమిత్‌ 5–0తో డిఫెండింగ్‌ చాంపియన్‌ కియరాన్‌ మెక్‌డొనాల్డ్‌ (ఇంగ్లండ్‌)పై గెలుపొందారు. 

Also read: World U20 Athletics లో తిరుమారన్ కు రజతం

కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్‌ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్‌ హుక్, రైట్‌ హుక్‌ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్‌ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది. ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్‌ నాలుగు బౌట్‌లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్‌లో నిఖత్‌ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్‌ 5–0తో గెలుపొందింది.  

Also read: Weekly Current Affairs (International) Bitbank: బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?

పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్‌ రోహిత్‌ టొకాస్‌ 2–3తో స్టీఫెన్‌ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్‌ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్‌ (భారత్‌) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్‌ ఒరీ (ఇంగ్లండ్‌)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు.   

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్‌ కమల్‌ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్‌ చూంగ్‌–లిన్‌ కరెన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శరత్‌ కమల్‌–సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (భారత్‌) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్‌ డ్రింక్‌హాల్‌–లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్‌ కమల్‌ 11–8, 11–8, 8–11, 

కామన్వెల్త్‌ గేమ్స్‌ స్క్వాష్‌ ఈవెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సౌరవ్‌ ఘోషాల్‌–దీపిక పల్లికల్‌ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.  ఈ పోటీల్లో సౌరవ్‌–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్‌–కామెరాన్‌ పిలె (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది.   

Also read: CWG 2022 : జెరెమీ లాల్‌రినుంగాకి స్వర్ణం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఈసారి ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో భారత జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆగస్టు 7న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 9 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. ముందుగా ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. 

Also read: Common Wealth Games : ఇంగ్లండ్‌ ఖాతాలో తొలి స్వర్ణం

16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం. 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది.   

Also read: Chess Olympiad 2022: చెన్నైలో ప్రారంభించిన ప్రధాని మోదీ

పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్స్‌ ఎల్డోజ్‌ పాల్, అబ్దుల్లా అబూబాకర్‌ స్వర్ణ, రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ క్రీడల చరిత్రలో ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా కేరళకు చెందిన ఎల్డోజ్‌ పాల్‌ గుర్తింపు పొందాడు. 25 ఏళ్ల ఎల్డోజ్‌ పాల్‌ 17.03 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. కేరళకే చెందిన అబూబాకర్‌ 17.02 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల ఈవెంట్‌లో వరుసగా స్వర్ణ, రజత పతకాలు నెగ్గిన భారత అథ్లెట్స్‌గా ఎల్డోజ్, అబూబాకర్‌ ఘనత వహించారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కృష్ణపూనియా, హర్వంత్‌ కౌర్, సీమా అంటిల్‌ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు.  

Also read: World Wrestling : అండర్ - 17లో భారత్ కు స్వర్ణం

మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో అన్నూ రాణి కాంస్య పతకం గెలిచింది. 29 ఏళ్ల అన్నూ రాణి జావెలిన్‌ను 60 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ గేమ్స్‌ చరిత్రలో మహిళల జావెలిన్‌ త్రోలో పతకం నెగ్గిన భారత ప్లేయర్‌గా అన్ను రాణి గుర్తింపు పొందింది. పురుషుల 10,000 రేస్‌ వాకింగ్‌లో భారత అథ్లెట్‌ సందీప్‌ కుమార్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సందీప్‌ 38 నిమిషాల 49.21 సెకన్లలో గమ్యానికి చేరాడు.   

Also read: World Athletics Championships 2022 : నీరజ్‌ చోప్రాకి రజతం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Aug 2022 06:35PM

Photo Stories