Skip to main content

Satya Nadella: కృత్తిమ మేధతో కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న‌... అలాగే భారీగా జీతాలు

కృత్తిమ మేధ ఆధారిత టూల్స్‌ చాట్‌జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ల వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక‌ నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.
Satya Nadella
Satya Nadella

ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై స్పందించారు. 

➤☛  హైదరాబాద్‌కు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ.. వేల మందికి ఉపాధి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాంకేతిక ప‌రిజ్ఞానం వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్​జీపీటీ, బార్డ్‌ వంటి టూల్స్‌ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు.

AI

చాట్​జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందనే అభిప్రాయాలు వ్య​క్తమవుతున్నాయి. 

satya nadella

ఈ తరుణంలో సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం వ‌ల్ల‌ ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత ప‌రిజ్ఞానం భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నాదెళ్ల అభిప్రాయ‌ప‌డ్డారు. 

➤☛ 20 ప్ర‌శ్న‌ల‌కు అర‌లీట‌ర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ... ఎందుకంటే

AI

అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్‌ని చదవడం, దాన్ని సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ సంతృప్తిని ఇస్తుందని.. ఇది కొత్త ఉద్యోగాల్ని సృష్టించే అవ‌కాశం ఉంద‌ని స‌త్య చెప్పారు. ఫ‌లితంగా కంపెనీల ఉత్పాదకత పెరిగి ఉద్యోగుల జీతాలు పెరుగుతాయన్నారు.

➤☛ ఇలా చేస్తే 16 ల‌క్ష‌లు మీవే... ఎలాగో తెలుసుకోండి

Published date : 19 May 2023 03:27PM

Photo Stories