Aero India 2025: ‘ఏరో ఇండియా’లో.. అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన

రష్యా, అమెరికా దేశాలు ఒకే వేదికపై తమ అత్యాధునిక యుద్ధ విమానాలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి.
భారతదేశం ఈ రెండు దేశాల మధ్య సమన్వయాన్ని సమర్థంగా నిర్వహించి, రష్యా, అమెరికా యొక్క అత్యాధునిక సాంకేతికతలను ఒకే వేదికపై ప్రదర్శించడంలో కీలకపాత్ర పోషించింది.
రష్యా నుంచి ఎస్‌యూ-57, 5వ తరం యుద్ధ విమానం భారత గగనతలంలో తొలిసారిగా ప్రదర్శించబడింది. ఈ విమానం సూపర్‌సోనిక్ క్రూయిజింగ్ స్పీడ్, ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్, రాడార్ వ్యవస్థలతో అత్యంత శక్తివంతమైన సాంకేతికతను అందిస్తుంది. రష్యా ఈ విమానం యొక్క సాంకేతికతను భారతదేశంకి అందించేందుకు ఒప్పందం చేసుకుంది.
Cryogenic Engine: శూన్య స్థితిలో క్రయోజనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్
భారత్, అమెరికా మధ్య 4 బిలియన్ డాలర్ల విలువైన కీలక ఒప్పందాలు ఏరో ఇండియా వేదికపై జరిగాయి. ఈ ఒప్పందాల్లో వైమానిక, జలాంతర్గామి, డ్రోన్, సైబర్ భద్రత రంగాల్లో భాగస్వామ్యం ఉంది. హెచ్‌ఏఎల్ సంస్థ జీఈ ఎరోస్పేస్తో ఎఫ్ 414 ఇంజిన్ల తయారీకి ఒప్పందం చేసింది. ఇది ఎల్‌సీఏ-ఎంకే2 విమానాలకు అవసరమైన ఇంజిన్లను తయారు చేస్తుంది.
అమెరికా నుంచి ఎఫ్-16, కేసీ-135 ట్యాంకర్, బీ-1 బాంబర్ వంటి అత్యాధునిక సాంకేతికతను భారత్‌తో పంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలో ‘ఏరో ఇండియా’ జరుగుతుంది.